Gold Price: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. భాగ్యనగరంలో ఎంతంటే?
ABN , Publish Date - Dec 21 , 2023 | 07:39 AM
కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం(Gol) ధరలు గురువారం ఒక్కసారిగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు. వివిధ ప్రాంతాల్లో బంగారం ధరల్లో రూ.350 పెరుగుదల నమోదైంది.
హైదరాబాద్: కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం(Gol) ధరలు గురువారం ఒక్కసారిగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు. వివిధ ప్రాంతాల్లో బంగారం ధరల్లో రూ.350 పెరుగుదల నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడతో పాటు, విశాఖపట్నంలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,900 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150 కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,750 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,350, 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ. 63,650 గా ఉంది.
వెండి ధరలు..
బంగారం ధర పెరగడంతో వెండి కూడా అదే బాట పట్టింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. గురువారం కిలో వెండి రూ. 1000 పెరిగింది. ఫలితంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 78,500 చేరింది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మినహా చాలా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది.