అన్నిరకాల ఔషధాలు అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2023-10-12T02:09:38+05:30 IST

తెలంగాణలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. కొన్ని రకాల మందులే సరఫరా చేస్తున్నారు...

అన్నిరకాల ఔషధాలు అందుబాటులో ఉంచాలి

తెలంగాణలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. కొన్ని రకాల మందులే సరఫరా చేస్తున్నారు. డాక్టర్లేమో పూర్తి కోర్సు వాడాలని వివిధ రకాల మందులు రాస్తారు. ప్రభుత్వ దవాఖానాలలో అవి లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు మెడికల్‌ దుకాణాలలో కొనాల్సి వస్తోంది. ఇది వారికి భారమవుతున్నది. స్థోమత లేనివారు సగం మందులే వాడుతూ వ్యాధులు తగ్గకపోవడంతో మళ్లీ మళ్లీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ లాంటి పెద్ద ఆసుపత్రుల్లోనూ ఈ దుస్థితి ఉంది. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుని పూర్తిస్థాయిలో ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసి, నిరుపేదలపై భారం తగ్గించాలి. మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

టి. పవన్‌కుమార్‌

Updated Date - 2023-10-12T02:09:38+05:30 IST