పండుగ వై‘భోగి’
ABN , First Publish Date - 2023-01-14T00:36:07+05:30 IST
పుడమిపై ఆవరించిన పొగమంచును పారద్రోలి, చలిపులిని పొలిమేరలకు తరిమికొట్ట అంబర యవనికను చీల్చుకుంటూ...
పుడమిపై ఆవరించిన
పొగమంచును పారద్రోలి,
చలిపులిని పొలిమేరలకు తరిమికొట్ట
అంబర యవనికను చీల్చుకుంటూ
పుడమిపైకి ప్రవేశించనున్న
నవ్యనూతన
భాస్కరుని నునువెచ్చని కిరణాలకు
స్వాగతం పలికే
భోగభాగ్యాల పండుగ,
సస్యలక్ష్మి గృహసీమలనలరించే పండుగ.
పాత చెడులను పారద్రోలే
అరిషడ్వర్గాలను అణచివేసే,
‘మంటల’ పండుగ.
కన్నెపిల్లల
గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు
పసిపిల్లల దృష్టి దోష నివారణ పండుగ.
బసవన్నల, బుడబుక్కల
హరిదాసుల, గాలిపటాల
సమైక్యతను పెంపొందించే పండుగ.
అనురాగాప్యాయతల
అందాల, ఆనందాల పండుగ
అదే అదే... మన భోగి పండుగ.
వేమూరి శ్రీనివాస్