ప్రభుత్వం చొరవ చూపాలి

ABN , First Publish Date - 2023-10-06T02:06:19+05:30 IST

తెలంగాణలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ప్రహసనంగా మారాయి. రాష్ట్రంలో ఒక మల్టీజోన్‌లో ప్రమోషన్లు నిలిచిపోగా, మరొక మల్టీజోన్‌లో జరుగుతున్నాయి. హైస్కూల్‌ విద్యలో కీలక పర్యవేక్షక...

ప్రభుత్వం చొరవ చూపాలి

తెలంగాణలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ప్రహసనంగా మారాయి. రాష్ట్రంలో ఒక మల్టీజోన్‌లో ప్రమోషన్లు నిలిచిపోగా, మరొక మల్టీజోన్‌లో జరుగుతున్నాయి. హైస్కూల్‌ విద్యలో కీలక పర్యవేక్షక అధికారులయిన గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ పోస్టులు రెండో మల్టీజోన్‌లో 750 వరకు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో ఇన్ని పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటే అనుకున్న ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమవుతుంది? ఎలిమెంటరీ విద్యలో కీలక పర్యవేక్షక అధికారులయిన ఎంఇఓ వ్యవస్థ సరియైన సర్వీస్‌ నిబంధనలు కొరవడి రెండు దశాబ్దాలుగా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడంతో కొన్ని జిల్లాల్లో అసలు ఎంఇఓలు లేని పరిస్థితి ఏర్పడింది. పాఠశాల విద్య గాడిన పడాలంటే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కోర్టు స్టేను తొలగించి రెండో మల్టీజోన్‌లో నిలిచిపోయిన ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలి.

శాగ శ్రీనివాస్‌

చిన్న పెండ్యాల

Updated Date - 2023-10-06T02:06:19+05:30 IST