గ్రామాల్లో మౌలిక వసతులు కరువు
ABN , First Publish Date - 2023-09-23T00:20:08+05:30 IST
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా గ్రామాలలో మౌలిక వసతుల కల్పన జరగకపోవడం చాలా బాధాకరం. చాలా గ్రామాలకు నేటికీ సరైన...
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా గ్రామాలలో మౌలిక వసతుల కల్పన జరగకపోవడం చాలా బాధాకరం. చాలా గ్రామాలకు నేటికీ సరైన రోడ్లు, రవాణా వ్యవస్థ లేదు. గ్రామాలలో ఉన్న వాగులపై కల్వర్టులు కానీ, బ్రిడ్జిలు కానీ లేవు. వాగులు పొంగి పొర్లే సమయంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిని ఆ నీటిలోనే మంచంపై వాగు దాటించాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిపై గొప్పలు చెప్పుకుంటున్నాయి కానీ ఆచరణ మాత్రం శూన్యం. గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచాలి. బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా చర్యలు తీసుకోవాలి. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు విడుదల చేసి అభివృద్ధి జరిగేలా చూడాలి.
షేక్ అస్లాం షరీఫ్
శాంతినగర్, జోగులాంబ గద్వాల జిల్లా