guruvinda ginjalu: ఈ గింజల్ని పూజగదిలో ఉంచితే.. అదృష్ణం, ఐశ్వర్యం వెతుక్కుంటూ వస్తాయట..!
ABN , First Publish Date - 2023-03-26T23:04:46+05:30 IST
ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు గింజలను చేతికి కంకణాలుగా చేయించుకుని ధరిస్తారు.
కాలం ఎంతగా మారిపోయినా కూడా పూర్వకాలపు ఆచారాలు, వ్యవహారాలు మారనేలేదు. ఇంకా వాటిని పాటిస్తున్నామంటే మన ఆచారాలు, వ్యవహారాల్లో ఉన్న ఉపయోగాలు అలాంటివి. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆబహ్వానించాలని ప్రయత్నించేవారు కొన్ని ఆమెకు ప్రీతికరమైన పనులు చేయక తప్పదు. నిజానికి ఆ దేవదేవికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులంటే మహా ఇష్టం అలాంటి వాటిని ఇంట్లో ఉంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీరూ ప్రయత్నించండి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.
గురువింద గింజలు వీటిని గురించి చిన్న తనంలో తెలిసే ఉంటుంది. పెద్దవారు వీటి పేరుతోనే ఓ సామెత చెప్పి మరీ ఈ గురువింత గింజలను గుర్తుచేసేవారు. వీటిని గౌడియ వైష్ణవులు రాధా రాణి పాద ముద్రలుగా పూజించేవారు. వీరు ఈ గింజలను సాలగ్రామ పూజలో తప్పనిసరిగా వాడేవారు. తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలల్లో మరగబెట్టి ఇందులోని విష లక్షణాలను తగ్గించి అప్పుడు వాడుకునే వారు. గొప్పలకు పోయే వారిని, ఎదుటివారిని అవమానించేవారిని ఈ గురువింద గింజలతో పోల్చుతారు.
ఇది కూడా చదవండి: ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిపి ఇచ్చే వాస్తు సూచనలు తెలుసా? ఇలా చేస్తే రెండూ ఖాయం..!
పూర్వం ఈ గింజలతోనే బంగారాన్ని తూకం వేసేవారట, బంగారం తూచి ఇన్ని గింజల ఎత్తని చెప్పేవారు.
అంతేనా గురువింత గింజల ఆకు తిన్నితరువాత, నోట్లో రాయిని వేసుకుని నమలాడినికి చూస్తే అది సునాయాసంగా నలిగి పిండిగా మారిపోతుందట.
దీపావళి సమయంలో ఈ గింజలను 8 గానీ 11గానీ తీసుకుని ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.
అక్షయతృతియరోజు కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవిని వీటితో ఆరాధిస్తారు.
ఎర్రని ఎరుపు వస్త్రంలో గురువిందగింజలను వేసి, కుంకుమతో కలిపి బిరువాలో ఉంచితే ధనాభి వృద్ధి కలుగుతుంది. ఇందులో తెలుపురంగు గింజలు శుక్రదోష నివారణకు, ఎరుపు రంగు గింజలు కుజగ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శని గ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలను గురుగ్రహ దోష నివారణకు, ఆకుపచ్చ గింజలను బుధ గ్రహ దోష నివారణకు ఉపయోగిస్తారు. ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు గింజలను చేతికి కంకణాలుగా చేయించుకుని ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల గ్రహదోషాలే కాదు, నరదృష్టి కూడా తొలగిపోతుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది.