vastu tips: వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశ చాలా పవర్ ఫుల్.. ఇక్కడ దోషాలుంటే ఇక అంతే సంగతులట.. వెంటనే సరిచేసుకోకపోతే..!
ABN , First Publish Date - 2023-03-28T10:57:36+05:30 IST
ఆగ్నేయ భాగంలో ఎటువంటి వాస్తు దోషములున్నా వెంటనే వాటిని సరి చేసుకోవాలని సూచిస్తున్నారు.
అగ్ని అనేది అందం, వ్యక్తిత్వం, డబ్బు అనుసంధానించబడిన ఒక అంశం. ఆగ్నేయ మండలం లేదా ఆగ్నేయ కోన ఇంట్లో డబ్బు ప్రవాహానికి సంబంధించినది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది. అయితే ఆగ్నేయం దిశలో వాస్తు దోషాలు ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిగతా అన్ని దిశల కంటే ఆగ్నేయ దిశ పై అత్యంత సూక్ష్మంగా శ్రద్ధ వహించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే అన్నీ శుభాలే..
ఆగ్నేయ దిశలో ఎటువంటి దోషాలు లేకపోతే ఆ కుటుంబంలో సుఖ శాంతులు ఉంటాయని, కుటుంబ సభ్యులకు కీర్తి లభిస్తుందని, విలాసవంతమైన జీవితం చేకూరుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. భార్యాభర్తల మధ్య అనుబంధాలు బలపడతాయి అని, వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతారు. ఇంటికి వచ్చే అతిధులకు గౌరవం దక్కుతుంది. భార్యకు భర్తపై ప్రేమ, భర్తకు భార్యపై ప్రేమ పుష్కలంగా ఉంటుంది. ఇక ఆగ్నేయ దిశలో వాస్తు దోషాలు ఉంటే ఎన్ని కావాలంటే అన్ని దుష్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ మొక్కతో ఎన్ని ప్రయోజనాలో.., లక్కీతోపాటు, ఐశ్వర్యాన్నీ తీసుకువచ్చే ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ ఉంచాలంటే..!
ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే సర్వ నాశనమే ఆగ్నేయంలో నైరుతి కంటే ఎత్తు పెరిగినా, గోతులున్నా, ద్వారం ఉన్నా దోషమే అంటున్నారు. ఆగ్నేయ భాగంలో వాస్తు దోషం ఉంటే అది ఎంత గొప్ప వారైనా సర్వనాశనం చేసి, భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా చేస్తుందని, బ్రతికుండగానే నరకం చూపిస్తుంది. అందుకే ఆగ్నేయ భాగంలో ఎటువంటి వాస్తు దోషములున్నా వెంటనే వాటిని సరి చేసుకోవాలని సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం ఆగ్నేయంలో చేయకూడనివి:
1. నీలం లేదా నలుపు రంగు ఉండకూడదు.
2. బోరింగ్ లేదా భూగర్భ నీటి ట్యాంక్ ఉండకూడదు.
3. టాయిలెట్ లేదా డస్ట్ బిన్ ఉండకూడదు.
4. ఈ దిశలో వాలు ఉండకూడదు.
5. ఈ జోన్‌ను పొడిగించకూడదు.
6. పసుపు రంగు ఉండకూడదు.