Vastu Tips For Home: వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రం చేసే చీపురు విషయంలో ఈ తప్పులు చేశారంటే..! దరిద్రం తప్పదట..!

ABN , First Publish Date - 2023-03-29T09:27:44+05:30 IST

ఈ చిన్న చిన్న పొరపాట్లే మన ఇంటి సౌభాగ్యాన్ని దెబ్బతీసే పనులట

Vastu Tips For Home: వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రం చేసే చీపురు విషయంలో ఈ తప్పులు చేశారంటే..! దరిద్రం తప్పదట..!
Vastu Tips For Home

సృష్టిలో ప్రతి వస్తువు దేవతా స్వరూపమే.. కొన్నింటి విషయంలో చూపించే శ్రద్ధ మరికొన్నింటి విషయంలో చూపించం. ఇది సహజంగా మనం చేసే పొరపాటే.. అయినా ఈ చిన్న చిన్న పొరపాట్లే మన ఇంటి సౌభాగ్యాన్ని దెబ్బతీసే పనులట .. అసలు విషయానికి వస్తే ఇంటిని ఊడ్చి శుభ్రం చేసే చీపురు విషయంలో చాలా పొరపాటుగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇలాంటి పొరపాట్లవల్ల తెలియకుండానే చాలా నష్టపోతూ ఉంటాం. ఇదంతా మన నిర్లష్యం వల్లనే. మహాలక్ష్మీ స్వరూపంగా భావించే చీపురుని..ఇల్లు శుభ్రం చేశాక ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనే విషయంలో చాలా పొరపాట్లు దొల్లుతూ ఉంటాయి. ఓ చిన్న చర్య ఇంట్లో చాలా విషయాలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా..?

ఉదయం లేచిన తరువాత ఏ పని చేయాలన్నా కూడా ఇంటిని శుభ్రం చేయాలి. అలాగే మనం ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలన్నా కూడా ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లు అనేది శుభ్రం చేసుకుంటాం. అయితే ఈ శుభ్రం చేసే క్రమంలో చీపురును ఉపయోగిస్తాం. పనైపోగానే చీపున్నిపక్కన పడేస్తాం. కానీ తెలిసినవారు చీపురును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. సాధారణంగా మన ఇంటిని మనం శుభ్రం చేసుకున్న తరువాత చీపురు ఒక మూలన పెడతాం. ఈ సమయంలో చీపురు పట్టుకునే స్థానాన్ని కిందికి, ఊడ్చే స్థానాన్ని పైకి పెట్టి చీపురును మూలన పెడతాం.

ఇలా చీపుర్ని పెడితే..

చీపురుకట్టను అలా నిలబెడితే దరిద్ర దేవత మన ఇంట్లోకి వచ్చిందని అర్థం. అనవసరంగా చీపురుకట్టలను ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. చీపురును ఆగ్నేయ లేదా ఈశాన్య మూలలో పెట్టరాదు. వాయువ్య మూల లేదా నైరుతి మూల లోనే పెట్టాలి.

ఇది కూడా చదవండి:

తులసి మొక్కకు రోజూ నీళ్ళు పోస్తున్నారా? అయితే చాలా నష్టపోతారు..!

సరస్వతికి ఆగ్రహం కలుగుతుంది.

సాధారణంగా మన ఇండ్లలో ఆడవారికి కోపం వస్తే చీపురుకట్టతో కొడుతూ ఉంటారు. ఇందులో 12 సంవత్సరాల లోపు పిల్లలని చీపురుకట్టతో కొడితే సరస్వతి దేవి ఆగ్రహానికి గురి అవుతుంది.

శివాయ నమః అనాలి.

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకొని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే శని ఆ ఇంట్లో అస్సలు ఉండడు. శుభ్రం చేసే క్రమంలో చెత్త అంతా బయట పడేయాలి.

పాచి పగ కోరుతుందట.

ఇల్లు ఊడ్చిన పాచిని ఇంట్లో ఓ మూల పోగుచేసి తీయకపోతే అది పగ సాధిస్తుంది. ఇంట్లో అశాంతికి కారణం అవుతుందని అంటారు.

1. చీపురును అందరికీ కనిపించేలా ఒకే దగ్గర ఉంచకూడదు కనిపించకుండా వాయువ్య మూలలో పెట్టాలి.

2. అలాగే ఇంటి లోపల, బయట ఒక చీపురు వాడవద్దు.

3. పూజగదిలో మరీ ముఖ్యంగా చీపురును అసలు వాడవద్దు.

4. సంధ్యా సమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి.

5. మంగళవారం మహాలయ పక్షము అనగా భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు నుంచి అమావాస్య వరకు ఉన్న సమయంలో చీపురును అసలు కొనకూడదు.

6. చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధనానికి లోటుండదు.

7. ఇంటిని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయాలి.

8. ఈశాన్యం వైపు చెత్త వేయకూడదు.

9. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు.

Updated Date - 2023-03-29T09:27:44+05:30 IST