Vastu Tips For Money: దారిలో దొరికిన డబ్బును తీసుకోవడం శుభమా, అశుభమా? తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసా..!
ABN , First Publish Date - 2023-04-07T10:50:32+05:30 IST
డబ్బుతో ఉన్న పర్సు దొరకడం వల్ల పూర్వీకుల ఆస్తిని పొందే సూచనలున్నాయట.
ఏదో ఒక సమయంలో రోడ్డుపై పడిపోయిన డబ్బు, నోట్లు మనకు నేలమీద పడి కనిపిస్తాయి. వాటిని అప్పటికి ఎవరూ చూడకపోతే వెంటనే తీసేస్తుంటారు. కొందరు ఆ ధనాన్ని ఇంటికి తీసుకువెళితే మంచిది కాదని వెంటనే పేదలకు ఇచ్చేస్తారు, మరికొందరు తీసి జేబులో వేసుకుంటారు. అయితే ఇలా చేయడం మనకు మంచిదేనా? దారిలో దొరికిన ధనాన్ని అలా ఇంటికి తీసుకువెళ్ళవచ్చా. అసలు తీసుకోవాలా వద్దా? ఈ విషయంగానే చాలాసార్లు మనసులో మధనపడతారు. అయితే రోడ్డు మీద దొరికిన ధనం ఎన్నో సంకేతాలను ఇస్తుందట. రోడ్డున దొరికిన ధనం శుభమో, అశుభమో తెలుసుకుందాం.
ధనం కనిపిస్తే ఇలా చేయండి.
దారిలో డబ్బు పడిపోయిందని తెలుసుకుంటే, త్వరలో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చని ఇది సూచిస్తుందట. అలాగే పనిలో, పురోగతితో పాటు, ధన ప్రయోజనాలను కూడా పొందుతారు.
జీవితంలో పురోగతి
దారిలో పడిపోయిన నాణెం ఎప్పుడైనా దొరికితే, అది జీవితంలో పురోగతిని ఇస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, దారిలో పడి ఉన్న నాణెం మిమ్మల్ని చేరుకోవడానికి ముందు చాలా మంది చేతులను దాటింది, అటువంటి పరిస్థితిలో తెలియని వ్యక్తుల సానుకూల శక్తి ఆ నాణెంలోకి ప్రవేశించిస్తుందట, దాని కారణంగా అది మీ జీవితంలో ఆనందాన్ని మాత్రమే తెస్తుందని నమ్మండి.
ఇది కూడా చదవండి: సుఖమయ జీవితానికి వాస్తు పాత్ర పెద్దదే..జీవితం సాఫీగా సాగేందుకు ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే చాలట..!
పూర్వీకుల ఆస్తిని పొందే సంకేతాలు
రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా పర్సు నిండా డబ్బు కనిపిస్తే, అది చాలా శుభసూచకంగా చెబుతారు. వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తే, డబ్బుతో ఉన్న పర్సు దొరకడం వల్ల పూర్వీకుల ఆస్తిని పొందే సూచనలున్నాయట.
దైవనుగ్రహం
దారిలో నడుస్తున్నప్పుడు నాణేలు దొరికితే దేవుడు మీతో ఉన్నాడని అర్థం. నిజానికి నాణేలు లోహంతో తయారు చేయబడినవి కాబట్టి పడిపోయిన నాణెం పొందిన వ్యక్తి దైవానుగ్రహాన్ని పొందుతాడని నమ్ముతారు. ఆ సమయంలో ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెడితే లాభం పొందే అవకాశం ఉంది.