Car Problems: ఎన్నో ఏళ్లుగా కార్లను వాడుతున్న వాళ్లకు కూడా తెలియని ట్రిక్స్ ఇవి.. కారులో ఒక్క సబ్బునయినా పెట్టుకుంటే..!

ABN , First Publish Date - 2023-09-08T11:31:12+05:30 IST

వర్షం కారణంగా సైడ్ మిర్రర్‌పై నీరు చేరడం వల్ల వెనుక వైపు చూడటం కష్టంగా మారుతుంది.

Car Problems: ఎన్నో ఏళ్లుగా కార్లను వాడుతున్న వాళ్లకు కూడా తెలియని ట్రిక్స్ ఇవి.. కారులో ఒక్క సబ్బునయినా పెట్టుకుంటే..!
very helpful.

సైకిల్, బండి, ఇప్పుడు కార్, సౌకర్యవంతమైన ప్రయాణానికి కాస్త డబ్బులు ఉంటే కొనుక్కునే కార్ ప్రయాణం ఎంత సులువో, దానికి కావల్సిన మేంటెనెన్స్ కూడా అంతే అవసరం. కానీ సంవత్సరంలో కార్‌కి ఎన్నిసార్లు సర్వీస్ చేయించినా కూడా ఇంకా ఏదో లోపంగానే కనిపిస్తుంది. కార్ లోపలి భాగంలో ఎటువంటి లోపం ఉందో మెకానిక్ ద్వారా తెలుసుకోవచ్చు, కానీ కాల్ లోపల సీట్ల నుంచి డోర్స్, సిట్టింగ్ ఇలా చాలా వాటిని మేంటెన్ చేయడం సరిగా తెలియాలి. దుమ్మూ, ధూళి రాకుండా చిన్న చిన్న చిట్కాలను పాటించడం తప్పని సరి. అయితే కారులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చీప్ ట్రిక్స్ తెలియాలి. వీటితో చాలా ఇబ్బందులను తరిమి కొట్టచ్చు. అవేమిటంటే..

కారు లోపాలను సరిచేయడానికి సంవత్సరానికి వేల రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ కార్ లోపలి శుభ్రతకు ఉపయోగపడే ఈ చిన్న చిట్కాల గురించి తెలుసుకుందాం.

కారు నుండి వాసన దూరంగా ఉంచడానికి..

కారు సరిగ్గా శుభ్రంగా ఉండాలంటే.. దుర్వసన ఈ సమస్యను నివారించడానికి ఖరీదైన ఫ్రెషనర్లను ఉపయోగిస్తారు. అయితే వాసనలు అలర్జీ ఉన్నవారికి పెద్ద సమస్యగా మారతాయి. దీనికి చక్కని పరిష్కారం సువాసనగల సబ్బులు, వీటి అరోమాథెరపీ కారు నుండి దుర్వాసన సమస్యను తొలగిస్తుంది.

కారు డోర్ నుండి వస్తున్న శబ్దానికి,

కారు తలుపులు తెరిచి మూసివేసేటప్పుడు శబ్దం వస్తుంటే, దానిని సబ్బు సహాయంతో ఆపియవచ్చు. దీని కోసం, డోర్ బోల్ట్‌లపై సబ్బును రుద్దండి, సబ్బు నునుపు దనానికి కార్ డోర్ శబ్దం ఆగుతుంది. అలాగే రిమ్ దెబ్బతింటుంటే, తలుపు తెరిచినప్పుడు, మూసివేసేటప్పుడు శబ్దం వచ్చే సమస్య ఉంటుంది. దీనికి రబ్బరు స్ట్రిప్ మీద కొన్ని రోజులు పొడి సబ్బును రుద్దవచ్చు.

ఇది కూడా చదవండి: 35 ఏళ్ల వయసు దాటిందా..? ముఖంపై ముడతలు స్టార్ట్ అయ్యాయా..? వీటిని తినడం మొదలు పెట్టేయండి..!


విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేయడానికి,

కారు నడుపుతున్నప్పుడు, విండ్‌షీల్డ్‌ను బాగా శుభ్రం చేయడం అవసరం, ముందున్న రహదారి స్పష్టంగా కనిపించడానికి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వర్షం, దుమ్ము కారణంగా ఒక్కోసారి వైపర్ కూడా శుభ్రం చేయనంత మురికిగా మారుతూ ఉంటాయి. దీనికి విండ్‌షీల్డ్‌పై సబ్బును ఉపయోగించవచ్చు. చిన్న వస్త్రంతో శుభ్రం చేస్తే మురికి, దుమ్ము పోయి అద్దం మెరుస్తుంది. దీనికి అవసరాన్ని బట్టి నీటిని వాడుకోవాలి. విండ్‌షీల్డ్ గీతలు పడకుండా నెమ్మదిగా తుడవాలి.

సైడ్ మిర్రర్ నుంచి నీటిని మళ్లీ మళ్లీ తుడవాల్సిన అవసరం ఉండదు.

వర్షం కారణంగా సైడ్ మిర్రర్‌పై నీరు చేరడం వల్ల వెనుక వైపు చూడటం కష్టంగా మారుతుంది. అందుకే మళ్లీ మళ్లీ తుడవాల్సివస్తుంది. దానిపై సబ్బు పట్టీని రుద్దండి. ఇలా చేస్తే నీరు దానిపై నిలిచి ఉండదు. బాగా డబ్బుఖర్చుచేసే వాషింగ్ లతో కన్నా ఇలా చిన్న చిన్న చిట్కాలతో కూడా సమస్యలను తరిమికొట్టచ్చు. ఓసారి ట్రై చేయండి.

Updated Date - 2023-09-08T11:31:12+05:30 IST