Dental care : మందుల కంటే చికిత్సలే మేలు
ABN , First Publish Date - 2023-03-14T04:23:29+05:30 IST
దంతాల ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ వాడకం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. ఎక్కువ శాతం దంతాల నొప్పులకు
దంతాల ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ వాడకం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. ఎక్కువ శాతం దంతాల నొప్పులకు యాంటీబయాటిక్స్‌తో ఉపశమనం దక్కదు. బదులుగా తీవ్రమైన దుష్ప్రభావాలకు గురి కావలసి వస్తుంది. పైగా యాంటీబయాటిక్స్‌ను అవసరానికి మించి వాడడం వల్ల యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనే తీవ్ర సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి దంతాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం నొప్పి నివారణ మందులు వాడుకోవడంతో పాటు, పల్పోటమీ, నాన్ సర్జికల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటి చికిత్సలతో సమస్యను నివారించుకోవాలి. ఒకవేళ దంత చికిత్స అందుబాటులో లేని సందర్భాల్లో, నొప్పితో పాటు వాపు, జ్వరం, లింఫ్ గ్రంథుల వాపు ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడుకోవాలి.