అమెరికాలో భారతీయుడికి 188 నెలల జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-24T19:11:00+05:30 IST

చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన కేసులో అమెరికాలోని భారతీయుడికి తాజాగా 188 నెలల జైలు శిక్ష పడింది. అసభ్యకర కంటెంట్‌ను ఇతరులతో పంచుకున్న నేరానికి యాంజెలో ఫర్నాండెజ్‌కు కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది.

అమెరికాలో భారతీయుడికి 188 నెలల జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన కేసులో అమెరికాలోని భారతీయుడికి తాజాగా 188 నెలల జైలు శిక్ష పడింది. అసభ్యకర కంటెంట్‌ను ఇతరులతో పంచుకున్న నేరానికి యాంజెలో ఫర్నాండెజ్‌కు కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది.

గోవాకు చెందిన ఫర్నాండెజ్ పిల్లల పోర్న్ వీడియోలను డేనియల్ క్రో అనే వ్యక్తికి షేర్ చేసి పోలీసులకు చిక్కాడు. ఇక తాను తప్పు చేసినట్టు కూడా అంగీకరించాడు. పిల్లలను ఉచ్చులోకి దింపేందుకు ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. దీంతో.. కోర్టు డేనలియల్‌కు డిసెంబర్ 12న 30 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.

ఇక బ్రిటన్‌లోని భారత సంతతికి వ్యక్తి అక్కడి కోర్టు 14 నెలల జైలు శిక్ష విధించింది. బ్రిటన్‌లో గంజాయి దిగుమతిపై నిషేధాన్ని ఉల్లంఘించినందుకు దర్శన్ పటేల్‌కు కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది. అయితే.. శిక్ష అమలును రెండేళ్లపాటు నిలుపుదల చేసింది. ఈ సమయంలో దర్శన్..కోర్టు నిబంధనలను తూచాతప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేని పక్షంలో 14 నెలల పాటు జైలుపాలుకాక తప్పదు. దర్శన్ చట్టాలను దుర్వినియోగ పరిచారని ప్రాసిక్యూటర్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.

Updated Date - 2023-03-24T19:11:38+05:30 IST