NRI: అమెరికాలో షాకింగ్ ఘటన.. టిక్‌టాక్ ఛాలెంజ్‌తో బాలుడి దుర్మరణం

ABN , First Publish Date - 2023-04-18T14:37:20+05:30 IST

అమెరికాలో సోషల్ మీడియా మాయలో పడి తాజాగా మరో చిన్నారి బలైపోయాడు.

NRI: అమెరికాలో షాకింగ్ ఘటన.. టిక్‌టాక్ ఛాలెంజ్‌తో బాలుడి దుర్మరణం

ఎన్నారై డెస్క్: అమెరికాలో సోషల్ మీడియా మాయలో పడి తాజాగా మరో చిన్నారి బలైపోయాడు. టిక్‌టాక్ ఛాలెంజ్‌కు ప్రయత్నించి చివరకు అసువులు బాసాడు. బెనిడ్రిట్ ఛాలెంజ్‌ ట్రెండ్ అతడి ప్రాణాలు తీసేసింది. గత కొంతకాలంగా ఈ టిక్‌టాక్ ఛాలెంజ్ అమెరికాలో కలకలం రేపుతోంది. అనేక మంది చిన్నారులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ పరిమితికి మించి బెనెడ్రిల్ ట్యాబ్లెట్టు వేసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా జస్టిన్ స్టీవెన్స్ అనే 13 ఏళ్ల బాలుడు ఏకంగా 14 ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు. సాధారణ డోసు కంటే ఇది ఏకంగా ఆరురెట్ల అధికం. దీంతో.. అతడు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.

దీంతో.. తల్లిదండ్రులు అతడిని ఆసుపత్రికి తరలించాడు. అతడి పరిస్థితి విషమించడంతో వైద్యులు జీవనాధార వ్యవస్థపై ఉంచారు. కానీ..రోజులు గడుస్తున్నా అతడిలో మార్పు లేకపోవడంతో చివరకు బాలుడి తల్లిదండ్రులు లైఫ్ సపోర్టు తొలగించేందుకు నిర్ణయించారు. దీంతో..చిన్నారి ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం ఈ ఉదంతం అమెరికాలో కలకలం రేపుతోంది.

తమ కొడుకు మరణం తరువాత జస్టిన్ తల్లిదండ్రులు ట్విట్టర్ వేదికగా ఇతరులను అప్రమత్తం చేశారు. టిక్‌టాక్ ఛాలెంజ్ బారినపడకుండా పిల్లలను కాపాడుకోవాలంటూ కోరారు. వెంటిలేటర్‌పై ఉన్న తమ కొడుకు చిత్రాన్ని కూడా వారు షేర్ చేశారు. ఇలాంటి ఛాలెంజ్ ట్రై చేద్దామనుకున్న పిల్లలకు ఇది చూపించండి అంటూ వేడుకున్నారు.

Updated Date - 2023-04-18T22:46:31+05:30 IST