USA: విద్యార్థులపై లైంగిక నేరాలకు పాల్పడ్డ 6 మహిళా టీచర్ల అరెస్ట్.. అమెరికాలో ఏం జరుగుతోంది?
ABN , First Publish Date - 2023-04-17T14:53:54+05:30 IST
విద్యా్ర్థులపై లైంగిక నేరాలకు పాల్పడ్డ 6 మహిళా టీచర్ల అరెస్ట్..
ఎన్నారై డెస్క్: అమెరికా..ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది తుపాకీ సంస్కృతి. విచ్చలివిడి తుపాకీ అమ్మకాల కారణంగా దుర్మాగులు, మానసిక సమతౌల్యంలేని వారి చేతిల్లో మారణాయుధాలు మహా విలయం సృష్టిస్తున్నాయి. ఇదిచాలదన్నట్టు.. తాజాగా మైనర్ విద్యా్ర్థులతో మహిళా టీచర్లు(Female Teachers) అనుచితంగా ప్రవర్తించిన(Sexual Misconduct) వరుస ఘటనలు అమెరికాను కుదిపేస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో వివిధ ఘటనల్లో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆరుగురు మహిళా టీచర్లు ఇటీవలే అరెస్టయ్యారు. ఈ ఉదంతం ప్రస్తుతం అమెరికాలో(USA) ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా పరిస్థితులపై అనేక అనుమానాలు, సందేహాలు లేవదిస్తున్న పరిణామాం ఇది.
విద్యాబుద్ధులు నేర్పించి చిన్నారులను మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన టీచర్లు పెడదోవపట్టడానికి కారణం ఏమిటి? అమెరికాలో టీచర్లు లైంగిక నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయా? పరిస్థితిని అదుపులోకి తెచ్చి విద్యావ్యవస్థను సరిదిద్దాలంటే ఏం చేయాలి? ఇవీ అక్కడి ప్రజల మనసులను తొలుస్తున్న ప్రజలు. అయితే..టీచర్ల పెడధోరణులను స్కూళ్ల యాజమాన్యాలు దాచిపెట్టకుండా నిర్భయంగా బహిరంగ పరుస్తుండటంతో కేసులు సంఖ్య పెరిగినట్టు అనిపిస్తోందని చెప్పేవారు లేకపోలేదు. పురుష టీచర్లుతో పాటూ మహిళా టీచర్లు ఇటువంటి నేరాలకు పాల్పడుతూ చిన్నారుల బాల్యాన్ని నాశనం చేస్తున్నారు.
లైంగిక నేరాలకు సంబంధించి అమెరికాలో జరిగిన పలు పరిశోధనల్లో సోషల్ మీడియా(Social Media) పాత్ర కూడా బయటపడింది. కొందరు టీచర్లు తమ విద్యార్థులను సోషల్ మీడియా సాయంతో మచ్చిక చేసుకుని దగ్గర అవుతున్నట్టు తేలింది. స్మార్ట్ ఫోన్లు(Smartphones) అందుబాటులోకి వచ్చాక లైంగిక అంశాలు సులువుగా అందుబాటులోకి రావడం వికృత ధోరణులకు కారణమవుతోందనేది నిపుణులు చెప్పే మాట. ఇక విద్యార్థులతో అనుచిత ప్రవర్తనకు సంబంధించి శిక్షల్లో పురుషులు, మహిళా టీచర్ల మధ్య వ్యత్యాసం ఉంటోందని చెబుతున్నారు. అయితే.. రెండు రోజుల వ్యవధిలో ఆరుగులు టీచర్లు లైంగిక ఆరోపణలపై అరెస్టు కావడంతో అమెరికాలో పెద్ద చర్చకు దారి తీసింది.