McDonald రెస్టారెంట్‌ రూ.107 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కిన మహిళ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-13T21:01:25+05:30 IST

మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్‌లో దారుణం అనుభవం ఎదుర్కొన్న ఓ మహిళ ఆ రెస్టారెంట్‌పై కోర్టుకెక్కింది.

McDonald రెస్టారెంట్‌ రూ.107 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కిన మహిళ.. అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్‌లో(McDonald's Restaurant) దారుణం అనుభవం ఎదుర్కొన్న ఓ మహిళ ఆ రెస్టారెంట్‌పై కోర్టుకెక్కింది. రెస్టారెంట్‌ తనకు పరిహారంగా రూ.107 కోట్ల(13 మిలియన్ డాలర్లు) నష్టపరిహారం ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫ్లోరిడాకు(Florida) చెందిన షెర్రీ హెడ్.. 2020 డిసెంబర్‌లో డోథాన్ ప్రాంతంలోని ఓ డ్రైవ్ థ్రూ రెస్టారెంట్‌లో కాఫీకి ఆర్డరిచ్చింది. అయితే.. కాఫీ మెషిన్ శుభ్రం చేస్తున్న కారణంగా కాఫీ ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇంతలో మరొకరు ఆమె వద్దకు వచ్చి కాఫీ యంత్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆ తరువాత ఆమెకు కాఫీ ఇచ్చారు.

వారిచ్చిన కాఫీని రుచిచూడగానే ఆ మహిళకు నోరు ఒక్కసారిగా మొద్దుబారి పోయింది. ఆ తరువాత నోరంతా మంటపుట్టింది. దీంతో..సాయం చేయాలని ఆమె రెస్టారెంట్ సిబ్బందిని అడిగినా వారు ఆమె ముఖం మీదే తలుపులు వేసేశారు. కాఫీకి బదులు తనకు ఏదో రసాయనం ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని భావించిన ఆమె కోర్టును ఆశ్రయించాలని ఇటీవల నిర్ణయించుకున్నారు. రెస్టారెంట్ నుంచి 13 మిలియన్ డాలర్ల మేర పరిహారం కోరుతూ కొన్ని నెలల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం దీనిపై విచారణ జరగనుంది.

కాగా.. ఈ ఘటన తరువాత షెర్రీ.. నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, పేగులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని ఆమె తరపు లాయర్ పేర్కొన్నారు. ఆమె ఆందోళనలో కూరుకుపోయిందని, తీవ్ర మానసిక వేదన మిగిలిందని చెప్పారు. ప్రస్తుతం షెర్రీ.. ఆహారం గొంతుక దిగక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆపరేషన్ అవసరం పడొచ్చని చెప్పారు. ఈ క్రమంలో.. షెర్రీకి జరిగిన నష్టానికి పరిహారంగా 3 మిలియన్ డాలర్లు, తప్పు చేసినందుకు శిక్షగా మరో 10 మిలియన డాలర్లు వెరసి మొత్తం 13 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ షెర్రీ కోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2023-02-13T21:01:27+05:30 IST