Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే!

ABN, First Publish Date - 2023-12-09T12:54:18+05:30 IST

పొద్దునే కడుపులో ఇంత కాఫీ గానీ, టీ గానీ పడకపోతే చాలామందికి రోజు ప్రారంభం కాదు. అయితే, కొందరికి టీ అలవాటు ఉంటే, మరికొందరికి కాఫీ బాగా నచ్చుతుంది. ఇక కాఫీలు చాలా ఫ్లేవర్లలో దొరుకుతుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ ఏంటి? దాని ఖరీదు ఎంత? అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే! 1/6

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ వచ్చేసి 'కోపి లువాక్' (Kopi Luwak). దీన్ని సివెట్ కాఫీ (Civet Coffee) అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సివెట్ లేదా పునుగు పిల్లి మలం (Poop) తో తయారు అవుతుంది.

Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే! 2/6

ఒక కప్పు సివెట్ కాఫీ కోసం వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. అమెరికాలో ఒక్క కప్పుకాఫీకి దాదాపు రూ. 6 వేలు ఉంటుంది. సౌదీ అరేబియా, దుబాయ్, యూఎస్, యూరప్ వంటి దేశాల్లో సివెట్ కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కాఫీ 1కేజీ ధర రూ. 20 నుంచి 25 వేల వరకు ఉంటుంది.

Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే! 3/6

వెంటనే ఈ కాఫీకి ఇంత ఖరీదు ఎందుకనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ. అంతేకాదండోయ్ పోషకాల గని కూడా.

Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే! 4/6

ఇక 'కోపి లువాక్' కాఫీ ఖరీదు పెరగడానికి మరో కారణం వచ్చేసి దాని తయారీ విధానం. ఇది చాలా డిఫరెంట్‌, కష్టంతో కూడుకున్నది కావడమే.

Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే! 5/6

పునుగు పిల్లులు కాఫీ గింజలను చాలా ఇష్టంగా తింటాయి. కానీ అవి చెర్రీ గుజ్జును పూర్తిగా జీర్ణం చేసుకోలేవు. దానికి కారణం వాటి పేగులలో జీర్ణ ఎంజైమ్‌లు అంతగా ఉండకపోవడమే. అందుకే అవి తిన్న కాఫీ గింజలు వాటి మలంతో పాటు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు వాటిని బాగా క్లీన్ చేసి, అన్ని రకాల సూక్ష్మజీవులు తొలగిపోయేలా పూర్తిగా శుద్ధి చేస్తారు. అనంతరం వాటిని కాల్చిన తర్వాత కాఫీ తయారు చేస్తారు.

Civet Coffee: ఈ పిల్లి మలంతో చేసే కాఫీ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే! 6/6

ఇక ఈ కాఫీ ఇండియాలోని కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలో అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇండోనేషియా కూడా ఈ కాఫీని భారీ పరిమాణంలో ఉత్పత్తి చేస్తోంది.

Updated at - 2023-12-09T14:01:08+05:30