Dhoni: అయ్యో మహీ.. ఎంతపనయిపోయింది.. మూడేళ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తున్న సీఎస్‌కే ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశేనా..?
ABN , First Publish Date - 2023-04-01T14:15:52+05:30 IST
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తమ అభిమాన ఆటగాడు ధోనీ ఆటను వీక్షించాలని ఎంతో మంది తమిళ అభిమానులు కోరుకుంటున్నారు. గత మూడేళ్లుగా చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు.
చెన్నైలోని (Chennai) చెపాక్ స్టేడియంలో (Chepauk Stadium) తమ అభిమాన ఆటగాడు ధోనీ (Dhoni) ఆటను వీక్షించాలని ఎంతో మంది తమిళ అభిమానులు కోరుకుంటున్నారు. గత మూడేళ్లుగా చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు. కరోనా కారణంగా రెండేళ్లు (2020, 21) ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. గతేడాది ఐపీఎల్ ముంబై, వాంఖడే, కోల్‌కతా, పుణె స్టేడియంల్లోనే జరిగింది. పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడంతో ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2023)లో అన్ని జట్లూ తమ హోమ్ గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నాయి.
ఈ నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత ధోనీ.. చెపాక్ స్టేడియంలో ఆడబోతున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చెన్నై టీమ్ తలపడబోతోంది. అయితే ఆ మ్యాచ్‌లో ధోనీ ఆడేదీ, లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు (Dhoni doubtful for next match). శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కీపింగ్ చేస్తూ ధోనీ గాయపడ్డాడు. దీపక్ చాహర్ లెగ్ సైడ్ వేసిన బంతిని అందుకునేందుకు ధోనీ ఎడమ వైపు డైవ్ చేశాడు. ఆ క్రమంలో ధోనీ ఎడమ కాలికి గాయం అయింది (Dhoni Injury). ఆ తర్వాత ఆ దెబ్బ వల్ల ధోనీ సరిగ్గా నిల్చోవడం కూడా కష్టమైంది. ఫిజయో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు.
IPL 2023: రుతురాజ్ సెంచరీని అడ్డుకున్న కొత్త రూల్.. ఎలా ఔట్ అయ్యాడో చూడండి.. చెన్నై ఫ్యాన్స్ ఫైర్..
ఈ నేపథ్యంలో సోమవారం జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడడేమో అని చెన్నై ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే చెన్నై టీమ్ కోచ్ ఫ్లెమ్మింగ్ ఆ ఆందోళనలను తోసి పుచ్చాడు. ``ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అతను చాలా రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. ఈ రోజు జరిగింది చాలా చిన్నది. 15 సంవత్సరాల క్రితంలా ఇప్పుడు ధోనీ వేగంగా, అతి చురుగ్గా ఉండలేడు. కానీ, అతను ఇప్పటికీ జట్టుకు గొప్ప నాయకుడు. అతనికి తన పరిమితులు తెలుసు. అతను ఒక లెజెండ్`` అని ఫ్లెమ్మింగ్ పేర్కొన్నాడు.