IPL 2023: తన రెస్టారెంట్‌కు ఆర్సీబీ ఆటగాళ్లను తీసుకెళ్లిన కోహ్లీ.. థ్రిల్లింగ్ మ్యాచ్‌కు ముందు ఆటవిడుపు..!
ABN , First Publish Date - 2023-04-05T13:37:59+05:30 IST
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మైదానం వెలుపలా, బయట చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ స్వంతంగా దేశంలోని పలు నగరాల్లో రెస్టారెంట్లను ఓపెన్ చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానం వెలుపలా, బయట చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ స్వంతంగా దేశంలోని పలు నగరాల్లో రెస్టారెంట్లను ఓపెన్ చేశాడు. అతడి రెస్టారెంట్ బ్రాండ్ పేరు వన్8 రెస్టారెంట్
(One8 Restaurant). ఐపీఎల్ (IPL 2023)లో భాగంగా గురువారం సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది (KKR vs RCB).
ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఆటగాళ్లు అందరూ ప్రస్తుతం కోల్‌కతాలో (Kolkata) ఉన్నారు. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఉన్న తన రెస్టారెంట్ బ్రాంచ్‌కు ఆర్సీబీ ఆటగాళ్లైన గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell), డుప్లెసిస్ (Faf du Plessis), మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)లను కోహ్లీ తీసుకెళ్లాడు. అక్కడ నలుగురూ డిన్నర్ చేశారు. ఆ రెస్టారెంట్లో నలుగురూ కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్‌కతాలోని గోల్డెన్ పార్క్ పరిసరాల్లో కోహ్లీ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.
Sehwag: అంత చెత్తగా ఆడితే ఎలా? వాళ్లను చూసి నేర్చుకో అంటూ యువ ఆటగాడిపై సెహ్వాగ్ విమర్శలు!
ముందుగా ఢిల్లీలోని ఏరోసిటీలో కోహ్లీ తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత కోల్‌కతాలో రెండో అవుట్లెట్ తెరిచాడు. ఆ తర్వాత పలు నగరాలకు విస్తరించాడు. ముంబైలోని ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్ నివసించిన ఐకానిక్ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని దాంట్లో కూడా తన రెస్టారెంట్ అవుట్‌లెట్‌ను మొదలుపెట్టాడు.