MS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. మైదానంలో జడేజాతో వాగ్వాదం.. వైరల్ అవుతున్న వీడియో..

ABN , First Publish Date - 2023-05-21T10:10:43+05:30 IST

మిస్టర్ కూల్ ధోనీ మిన్ను విరిగి మీద పడుతున్నా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎప్పుడూ భావోద్వేగాలు ప్రదర్శించడు. ఇతర ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించడు. అయితే శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోనీ కాస్త అసహనానికి గురయ్యాడు.

MS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. మైదానంలో జడేజాతో వాగ్వాదం.. వైరల్ అవుతున్న వీడియో..

మిస్టర్ కూల్ ధోనీ (MS Dhoni) మిన్ను విరిగి మీద పడుతున్నా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎప్పుడూ భావోద్వేగాలు ప్రదర్శించడు. ఇతర ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించడు. అయితే శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (CSKvsDC) మాత్రం ధోనీ కాస్త అసహనానికి గురయ్యాడు. చెన్నై ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ, మ్యాచ్ చివర్లో జడేజాతో ధోనీ సీరియస్‌గా మాట్లాడుతుండడం కనిపించింది.

మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లందరూ ఒకరినొకరు అభినందించుకుని డగౌట్ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో జడేజా దగ్గరకు ధోనీ వెళ్లాడు. జడేజాతో ఏదో విషయమై సీరియస్‌గా మాట్లాడాడు (Dhoni Had A Heated Conversation With Jadeja). ధోనీ మాట్లాడుతున్నంత సేపు జడేజా మాట్లాడలేదు. ఆ తర్వాత జడేజా కూడా ధోనీకి సీరియస్‌గానే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత జడేజా నుంచి ధోనీ దూరంగా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. ధోనీ, జడేజా మధ్య ఏం జరిగిందోనని అందరూ చర్చించుకుంటున్నారు.

Rinku Singh: లఖ్‌నవూ అదృష్టం బాగుంది.. ఒక్క పరుగుతో గట్టెక్కింది.. రింకూ బ్యాటింగ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..

శనివారం జరిగిన మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 50 పరుగులు ఇచ్చేశాడు. ఇదే విషయం గురించి జడేజాతో ధోనీ మాట్లాడి ఉంటాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదైమైనా శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

Updated Date - 2023-05-21T10:10:43+05:30 IST