Arjun Tendulkar: పాపం.. అర్జున్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. రోహిత్ అలా చేయకుంటే బాగుండేదా?
ABN , First Publish Date - 2023-04-23T13:49:25+05:30 IST
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ప్రయాణం రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఫర్వాలేదనిపించిన అర్జున్ మూడో మ్యాచ్‌లో అసలు సిసల సవాలు ఎదుర్కొన్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వారసుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఐపీఎల్ (IPL 2023) ప్రయాణం రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఫర్వాలేదనిపించిన అర్జున్ మూడో మ్యాచ్‌లో అసలు సిసల సవాలు ఎదుర్కొన్నాడు. ఆరంభంలో అద్భుత యార్కర్‌తో ప్రభుసిమ్రాన్ సింగ్‌ను పెవిలియన్ చేర్చి స్వింగ్‌లో కనిపించాడు. అయితే చివర్లో మాత్రం భారీగా పరుగులు సమర్పించాడు. పంజాబ్ (PBKS) ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన అర్జున్ ఏకంగా 31 పరుగులు ఇచ్చాడు.
అప్పటివరకు చప్పగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ అర్జున్ ఓవర్‌తో ఒక్కసారిగా పైకి లేచింది. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంపై అర్జున్ ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టుగా కనిపించలేదు. బ్యాట్స్‌మెన్ హిట్టింగ్ చేస్తున్నా ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేసి భారీగా మూల్యం చెల్లించుకున్నాడు. నిజానికి ఆ ఓవర్ పియూష్ చావ్లా వేయాల్సింది. అప్పటికి మూడు ఓవర్లు వేసిన చావ్లా 15 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అలాంటి చావ్లాను కాదని అనుభవం లేని అర్జున్ చేతికి రోహిత్ (Rohit Sharma) బంతినిచ్చాడు. దీంతో పంజాబ్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు.
Arshdeep Singh: రెండుసార్లు స్టంప్‌లు విరగ్గొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. బీసీసీఐకి ఎంత నష్టమో తెలుసా?
ఒక్క ఓవర్లో భారీగా పరుగులు సమర్పించిన అర్జున్ టెండూల్కర్‌పై సోషల్ మీడియాలో విమర్శల దాడి మొదలైంది (Trolling on Arjun Tendulkar). ``వారసత్వం కోటాలో జట్టులోకి వచ్చిన అర్జున్ సత్తా బయటపడింది``, ``అసలైన బ్యాట్స్‌మెన్ తగిలితే ప్రిన్స్ అర్జున్ పరిస్థితి ఇంతే`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.