Badoni vs Livingstone: బదోనీ, లివింగ్‌స్టన్ మధ్య హైడ్రామా.. ఎత్తుకు పై ఎత్తులు.. చివరకు ఏమైందంటే..
ABN , First Publish Date - 2023-04-29T10:13:37+05:30 IST
ఐపీఎల్ అంటేనే వినోదం. క్రికెట్ ప్రేమికులకు లభించే అంతులేని మజా. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చాలా మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు వెళ్లి ప్రేక్షకులకు థ్రిల్ అందించాయి.
ఐపీఎల్ (IPL 2023) అంటేనే వినోదం. క్రికెట్ ప్రేమికులకు లభించే అంతులేని మజా. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చాలా మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు వెళ్లి ప్రేక్షకులకు థ్రిల్ అందించాయి. శుక్రవారం రాత్రి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ (LSGvsPBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు శివాలెత్తారు. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పోటీపడి పరుగులు చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటర్ ఆయుష్ బదోనీ (Ayush Badoni), పంజాబ్ బౌలర్ లివింగ్‌స్టన్ (Liam Livingstone) మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
లఖ్‌నవూ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బదోనీ ఆడుతుండగా లివింగ్‌స్టన్ బౌలింగ్‌కు వచ్చాడు. లివింగ్‌స్టన్ రెండో బంతి వేస్తుండగా బదోనీ రివర్స్ స్వీప్ ఆడేందుకు పొజిషన్ మార్చాడు. దీంతో లివింగ్‌స్టన్ చివరి క్షణంలో బౌలింగ్ ఆపేశాడు. దీంతో బదోనీకి కోపం వచ్చింది. ఆ తర్వాత లివింగ్‌స్టన్ బౌలింగ్ చేస్తుండగా బదోనీ చివరి క్షణంలో పక్కకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత లివింగ్‌స్టన్ వేసిన బంతిని బదోనీ సిక్సర్ బాదాడు.
LSGvsPBKS: బాబోయ్.. ఇదేం బాదుడు.. మొహలీ పిచ్‌పై నెటిజన్ల కామెంట్లు చూస్తే..
ఆ తర్వాత కూడా లివింగ్‌స్టన్ అదే తరహా బంతిని వేశాడు. కాకపోతే బంతి వేగం తగ్గించాడు. లివింగ్‌స్టన్ ట్రాప్‌లో పడిన బదోనీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే అది స్లో బాల్ కావడంతో స్క్వేర్ లెగ్‌లో రాహుల్‌కు చిక్కాడు. అలా ఇద్దరూ ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్నారు. చివరకు ఈ డ్రామాలో బదోనీపై లివింగ్‌స్టన్ విజయం సాధించినట్టైంది.