IPL 2023: కోట్లు పోసి కొంటే ఇలానా ఆడేది.. అట్టర్‌ప్లాప్ అయిన ఈ ముగ్గురినీ ఎంతకు కొన్నారో గుర్తుందా..?

ABN , First Publish Date - 2023-04-03T08:11:18+05:30 IST

ఐపీఎల్ (IPL 2023) అంటే కాసుల వర్షం. అటు ఆటగాళ్ల నుంచి ఇటు ఫ్రాంఛైజీల వరకు అంతా సంపాదన మీదే దృష్టి కేంద్రీకరిస్తారు. సీజన్‌కు ముందు జరిగే వేలంలో టీ-20 ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు భారీగా డబ్బులు వెదజల్లుతాయి.

IPL 2023: కోట్లు పోసి కొంటే ఇలానా ఆడేది.. అట్టర్‌ప్లాప్ అయిన ఈ ముగ్గురినీ ఎంతకు కొన్నారో గుర్తుందా..?

ఐపీఎల్ (IPL 2023) అంటే కాసుల వర్షం. అటు ఆటగాళ్ల నుంచి ఇటు ఫ్రాంఛైజీల వరకు అంతా సంపాదన మీదే దృష్టి కేంద్రీకరిస్తారు. సీజన్‌కు ముందు జరిగే వేలంలో (IPL Auction) టీ-20 ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు భారీగా డబ్బులు వెదజల్లుతాయి. అయితే వారిలో కొందరు తమ విలువకు న్యాయం చేయలేక యాజమాన్యాలను నిరాశ పరుస్తుంటారు. ఈ సీజన్ మొదలై మూడు రోజులే అయినప్పటికీ తమ తొలి మ్యాచ్‌ల్లో విఫలమైన ఖరీదైన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..

తమ తొలి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) ఓటములు మూటకట్టున్నాయి. ఆయా జట్లు భారీగా ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లు కూడా విఫలమయ్యారు. ఎక్కువగా వెటరన్ ప్లేయర్లతో నిండిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్‌ (Ben Stokes)ను రూ.16.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. బౌలింగ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.

IPL 2023: అర్ష్‌దీప్ vs అఫ్రీది.. భారత్, పాక్ అభిమానుల మధ్య ట్విటర్ వార్.. కారణమేంటంటే..

ఇక, ఇంగ్లండ్‌కు చెందిన మరో ఆటగాడు హ్యారీ బ్రూక్‌ (Harry Brook) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా రూ. 13.25 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక, ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) కోసం ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా రూ.17 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ కూడా గ్రీన్ నిరాశపరిచాడు. బ్యాటింగ్‌కు దిగి 5 పరుగులు మాత్రమే చేసిన గ్రీన్.. రెండు ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చాడు.

IPL 2023 వేలం: ఖరీదైన విదేశీ ఆటగాళ్లు

18.5 కోట్లు – సామ్ కర్రాన్ (పంజాబ్ కింగ్స్) – 26 (17)* & 3-0-38-1

17 కోట్లు – కామెరాన్ గ్రీన్ (ముంబై ఇండియన్స్) – 5 (4) & 2-0-30-1

16.25 కోట్లు – బెన్ స్టోక్స్ (చెన్నై) – 7 (6)

16 కోట్లు – నికోలస్ పూరన్ (లక్నో) – 36 (21)

13.25 కోట్లు – హ్యారీ బ్రూక్ (హైదరాబాద్) – 13 (21)

Updated Date - 2023-04-03T09:13:31+05:30 IST