Share News

కొత్తబంతిపై నియంత్రణలో నాకంటే బుమ్రా బెటర్‌

ABN , First Publish Date - 2023-10-31T05:12:57+05:30 IST

కొత్త బంతిపై నియంత్రణలో తనకంటే జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంతో మెరుగని పాకిస్థాన్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ వసీమ్‌ అక్రమ్‌ ప్రశంసించాడు. ‘కొత్త బంతితో కుడిచేతి వాటం బ్యాటర్లకు అవుట్‌ స్వింగర్లు...

కొత్తబంతిపై నియంత్రణలో నాకంటే బుమ్రా బెటర్‌

న్యూఢిల్లీ: కొత్త బంతిపై నియంత్రణలో తనకంటే జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంతో మెరుగని పాకిస్థాన్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ వసీమ్‌ అక్రమ్‌ ప్రశంసించాడు. ‘కొత్త బంతితో కుడిచేతి వాటం బ్యాటర్లకు అవుట్‌ స్వింగర్లు వేసే సమయంలో బంతిపై నాకు నియంత్రణ ఉండేది కాదు. కానీ ఆ విషయంలో నాకంటే బుమ్రా నిస్సందేహంగా మెరుగైన బౌలర్‌’ అని అక్రమ్‌ చెప్పాడు. అలాగే మరో పేసర్‌ షమిపైనా అక్రమ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక పాకిస్థాన్‌ మరో మాజీకెప్టెన్‌ మి స్బా ఉల్‌ హక్‌.. బుమ్రాను పొగుడుతూ ‘బంతిని బుమ్రా స్వింగ్‌ చేయడమేకాదు..కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో తాను అనుకున్న ప్రదేశంలో బంతులు వేయడం ద్వారా బ్యాటర్లకు షాట్లు కొట్టే అవకాశం ఇవ్వడం లేదు’ అని చెప్పాడు.

Updated Date - 2023-10-31T05:12:57+05:30 IST