MS Dhoni: ఒక్కడిపై అంత అభిమానమా? ఢిల్లీలో ధోనీపై అభిమాన సంద్రం.. బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు దద్దరిల్లిన స్టేడియం!
ABN , First Publish Date - 2023-05-21T08:52:51+05:30 IST
బహుశా క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతున్నట్టుంది. ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండడంతో ధోనీకి దేశంలోని క్రికెట్ అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు.
బహుశా క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం మహేంద్ర సింగ్ ధోనీకే (MS Dhoni) దక్కుతున్నట్టుంది. ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండడంతో ధోనీకి దేశంలోని క్రికెట్ అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మ్యాచ్ ఎక్కడ జరుగుతున్నా అభిమానులందరూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్‌కే సపోర్ట్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది (CSKvsDC). ఈ సీజన్‌లో చెన్నై టీమ్‌కు ఇదే చివరి లీగ్ మ్యాచ్. దీంతో ధోనీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం పసుపు సంద్రంగా మారింది. స్టేడియం బయట ధోనీ బస్సు దిగుతున్నప్పుడు అభిమానులు అతడికి ఘన స్వాగతం పలికారు. ఇక, స్టేడియంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడైతే స్టేడియం అంతా ధోనీ నామస్మరణతో హోరెత్తింది. ఈ సీజన్‌లో ధోనీ బ్యాట్‌తో పెద్దగా పరుగులేమీ చేయలేదు. చివర్లో బ్యాటింగ్‌కు దిగి కేవలం నాలుగు, ఐదు బంతులు మాత్రమే ఆడుతున్నాడు. అదే గొప్ప భాగ్యం అన్నట్టు అభిమానులు మురిసిపోతున్నారు. టీమిండియాను అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగ్గా తీర్చిదిద్దిన ధోనీకి మద్దతు పలుకుతున్నారు.
Liam Livingstone: లివింగ్‌స్టోన్‌కు ఏమైంది? శుక్రవారం మ్యాచ్‌లో తడబాటు.. ఔటైన తర్వాత నవ్వుకుంటూ..!
అంతకుముందు చెన్నై టీమ్ స్టేడియం దగ్గరకు చేరుకుంటున్న సమయంలో అభిమానులు బస్సును చుట్టుముట్టారు. సీఎస్‌కే జెర్సీలు ధరించిన అభిమానులు ధోనీని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆ రూట్‌లో కొంచెం సేపు ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన చెన్నై టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.