Ajinkya Rahane: అంత ఆలస్యమెందుకు? రహానే డీఆర్‌ఎస్ నిర్ణయంపై అభిమానుల అనుమానం!

ABN , First Publish Date - 2023-05-07T11:37:12+05:30 IST

ఈ ఐపీఎల్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ జోరు కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్‌తో (CSKvsMI) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది.

Ajinkya Rahane: అంత ఆలస్యమెందుకు? రహానే డీఆర్‌ఎస్ నిర్ణయంపై అభిమానుల అనుమానం!

ఈ ఐపీఎల్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ జోరు కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్‌తో (CSKvsMI) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని ఆచితూచి ఆడుతూ ఛేదించింది. 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఔట్ నిర్ణయంపై కాస్త వివాదం నెలకొంది.

చెన్నై ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్ వేసేందుకు పియూష్ చావ్లా (Piyush Chawl) వచ్చాడు. ఆ ఓవర్ చివరి బంతికి కాస్త హైడ్రామా నెలకొంది. పియూష్ వేసిన ఫుల్ లెంగ్త్ గూగ్లీని రహానే డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి టర్న్ అయి రహానే ప్యాడ్స్‌కు తగిలింది. పియూష్ చావ్లా అప్లై చేయడంతో అంపైర్ వెంటనే ఔట్ అని ప్రకటించాడు. రహానే వెంటనే డీఆర్‌ఎస్ (DRS) కోరాడు. అయితే రీప్లే బాల్ స్టంప్స్‌కు అవుట్ సైడ్ పడినట్టు స్పష్టమైంది. అయితే నిర్ణయం వెలువరించేందుకు థర్డ్ అంపైర్ చాలా సమయం తీసుకున్నాడు.

Kohli vs Ganguly: చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

బంతి అవుట్ సైడ్ పడడం, ఇంపాక్ట్ స్టంప్స్ లైన్‌లో ఉండడంతో నిర్ణయం విషయంలో థర్డ్ అంపైర్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. చివరకు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి లోబడి అవుట్ అని ప్రకటించారు. ఈ నిర్ణయంపై చెన్నై ఫ్యాన్స్ (CSK Fans) సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది చెత్త నిర్ణయం అని, నిర్ణయం ప్రకటించడానికి అంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-05-07T11:37:12+05:30 IST