IPL 2023: వుయ్ మిస్ యూ పంత్.. ఢిల్లీ టీమ్ ఏం చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న ఫొటో
ABN , First Publish Date - 2023-04-02T07:59:14+05:30 IST
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్ రిషభ్ పంత్ కొద్ది నెలల క్రితం భారీ ప్రమాదానికి గురయ్యాడు. కారులో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) టీమ్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కొద్ది నెలల క్రితం భారీ ప్రమాదానికి గురయ్యాడు. కారులో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి అడుగులేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్ (IPL 2023) సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. పంత్‌ను ఎలాగైనా తమ డ్రెస్సింగ్ రూమ్‌లో భాగం చేయాలనుకుంటున్నామని డీసీ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) చెప్పాడు.
పాంటింగ్ అనుకున్నట్టుగా పంత్ ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరకు కూడా రాలేకపోయాడు. దీంతో ఢిల్లీ టీమ్ తమ కెప్టెన్ గౌరవార్థం అతడి జెర్సీని (Rishabh Pant Jersey) డగౌట్‌కు తగిలించింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన పంత్ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ``మిస్ యూ పంత్`` అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీ టీమ్ శనివారం జరిగిన మ్యాచ్‌తో తమ ఐపీఎల్-2023 ప్రస్థానాన్ని ప్రారంభించింది. పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ (David Warner) ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Dhoni: అయ్యో మహీ.. ఎంతపనయిపోయింది.. మూడేళ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తున్న సీఎస్‌కే ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశేనా..?
శనివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో (LSG vs DC) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 రన్స్ తేడాతో లఖ్‌నవూ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు సాధించింది. అనంతరం భారీ ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసి ఓడింది.