RCB vs MI : అదరగొట్టిన కోహ్లీ, డుప్లెసి

ABN , First Publish Date - 2023-04-03T00:30:27+05:30 IST

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఘనంగా బోణీ చేయగా.. సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడే ఆనవాయితీని ముంబై ఇండియన్స్‌ కొనసాగించింది. విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82 నాటౌట్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డుప్లెసి

RCB vs MI : అదరగొట్టిన కోహ్లీ, డుప్లెసి

ఘనంగా బెంగళూరు బోణీ

8 వికెట్లతో ఓడిన ముంబై

తిలక్‌ వర్మ శ్రమ వృథా’’

కోహ్లీ (49 బంతుల్లో82 నాటౌట్‌)’

సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడడం ముంబైకు ఇది వరుసగా పదకొండోసారి.

బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఘనంగా బోణీ చేయగా.. సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడే ఆనవాయితీని ముంబై ఇండియన్స్‌ కొనసాగించింది. విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82 నాటౌట్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డుప్లెసి (43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73) రాణించడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్లతో ముంబైపై అలవోకగా నెగ్గిం ది. తొలుత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 నాటౌట్‌) పోరాటం వృథా అయింది. ఛేదనలో బెంగళూరు 16.2 ఓవర్లలో 172/2 స్కోరు చేసి నెగ్గింది.

ఓపెనర్ల హవా: ఛేదనలో ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసి.. బెంగళూరుకు ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. మూడో ఓవర్‌లో బెహ్రెన్‌డార్ఫ్‌ బౌలింగ్‌లో డుప్లెసి 4,6,6తో బ్యాట్‌కు పని చెప్పాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న కోహ్లీ 6,4తో ఎదురుదాడి చేయడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 53/0తో పటిష్టస్థితిలో నిలిచింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ధాటిగా ఆడడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ వేగంగా కరిగింది. అయితే, 15వ ఓవర్‌లో డుప్లెసిని క్యాచవుట్‌ చేసిన అర్షద్‌.. తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. విజయానికి చివరి 30 బంతుల్లో 24 పరుగులు కావాల్సి ఉండగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దినేష్‌ కార్తీక్‌ డకౌటయ్యాడు. కానీ మ్యాక్స్‌వెల్‌ (3 బంతుల్లో 2 సిక్స్‌లతో 12 నాటౌట్‌), విరాట్‌ వరుస సిక్స్‌లతో 22 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.

తిలక్‌ ఒక్కడే..: టాప్‌ స్టార్లు చేతులెత్తేసినా.. తిలక్‌ వర్మ ఒంటరి పోరాటంతో ముంబై పోరాడగలిగే స్కోరు చేసింది. పవర్‌ హిట్టర్లు ఇషాన్‌ (10), గ్రీన్‌ (5), రోహిత్‌ (1) విఫలం కావడంతో.. జట్టు ఒక దశలో 20/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ అంచనాలున్న సూర్యకుమార్‌ (15) నిష్క్రమణతో 10 ఓవర్లు ముగిసేసరికి 55/4తో నిలిచింది. కానీ, నేహల్‌ వధేరా (21)తో కలసి ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించిన వర్మ.. స్లాగ్‌ ఓవర్లలో అర్హద్‌ ఖాన్‌ (15 నాటౌట్‌) అండతో జట్టు స్కోరును అనూహ్యంగా 170 మార్క్‌ దాటించాడు. తిలక్‌ జోరుకు బెంగళూరు బౌలర్లు చివరి 5 ఓవర్లలో 69 పరుగులు సమర్పించుకొన్నారు.

స్కోరుబోర్డు

ముంబై: రోహిత్‌ (సి) దినేశ్‌ (బి) ఆకాశ్‌ 1, ఇషాన్‌ (సి) హర్షల్‌ (బి) సిరాజ్‌ 10, గ్రీన్‌ (బి) టోప్లే 5, సూర్యకుమార్‌ (సి) షాబాజ్‌ (బి) బ్రేస్‌వెల్‌ 15, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 84, నేహల్‌ వధేరా (సి) కోహ్లీ (బి) కర్ణ్‌శర్మ 21, టిమ్‌ డేవిడ్‌ (బి) కర్ణ్‌శర్మ 4, హృతిక్‌ షోకీన్‌ (సి) డుప్లెసి (బి) హర్షల్‌ 5, అర్షద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 171/7; వికెట్ల పతనం: 1-11, 2-16, 3-20, 4-48, 5-98, 6-105, 7-123; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-21-1, టోప్లే 2-0-14-1, ఆకాశ్‌దీప్‌ 3-0-29-1, హర్షల్‌ పటేల్‌ 4-0-43-1, కర్ణ్‌శర్మ 4-0-32-2, బ్రేస్‌వెల్‌ 2-0-16-1, మ్యాక్స్‌వెల్‌ 1-0-16-0.

బెంగళూరు: కోహ్లీ (నాటౌట్‌) 82, డుప్లెసి (సి) డేవిడ్‌ (బి) అర్షద్‌ 73, దినేశ్‌ కార్తీక్‌ (సి) తిలక్‌ (బి) గ్రీన్‌ 0, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 12, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 16.2 ఓవర్లలో 172/2; వికెట్ల పతనం: 1-148, 2-149; బౌలింగ్‌: బెహ్రెన్‌డార్ఫ్‌ 3-0-37-0, అర్షద్‌ 2.2-0-28-1, ఆర్చర్‌ 4-0-33-0, పీయూష్‌ చావ్లా 4-0-26-0, గ్రీన్‌ 2-0-30-1, హృతిక్‌ షోకీన్‌ 1-0-17-0.

Updated Date - 2023-04-03T00:30:27+05:30 IST