MS Dhoni: నా ఫేర్‌వెల్ కోసం వచ్చారేమో.. ఈడెన్ గార్డెన్స్‌లో అభిమాన సంద్రంపై ధోనీ సరదా వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2023-04-24T11:25:13+05:30 IST
ప్రస్తుత ఐపీఎల్‌లో అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీపైనే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై టీమ్ దుమ్ము రేపుతోంది.
ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీపైనే (MS Dhoni) ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై టీమ్ దుమ్ము రేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ సీజన్ పూర్తయ్యాక ఇక ఐపీఎల్‌కు కూడా ధోనీ రిటైర్మెంట్ (Dhoni Retirement) ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ధోనీ కూడా పదే పదే తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆదివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ (CSKvsKKR) జరిగింది.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్‌పై 49 పరుగుల తేడాతో చెన్నై టీమ్ విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం స్టేడియంలోని ప్రేక్షకులు (Kolkata Fans) స్థానిక కోల్‌కతా టీమ్‌కు కాకుండా ధోనీకి మద్దతుగా నిలిచారు. ``ధోనీ.. ధోనీ..`` అంటూ కేకలు పెట్టారు. బ్యాటింగ్ కోసం ధోనీ వస్తున్నప్పుడు అందరూ చప్పట్లతో అభినందించారు. మ్యాచ్ అనంతరం అభిమానుల గురించి ధోనీ మాట్లాడాడు. ``మ్యాచ్ ఆసాంతం మాకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. వీరందరూ తర్వాతి మ్యాచ్‌కు తప్పకుండా కోల్‌కతాకే సపోర్ట్ చేస్తారు. ఈ మ్యాచ్‌లో మాత్రం నాకు ఫేర్‌వెల్ (Farewell) ఇచ్చేందుకు వచ్చినట్టు ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్ అభిమానులకు ధన్యవాదాలు.
Ajinkya Rahane: సూపర్ ఫామ్‌లో రహానే.. ఇక, సెలక్టర్లకు మరో దారి లేదు.. ఏ నిర్ణయం తీసుకుంటారో..!
ఈ సీజన్‌లో మా టీమ్ ప్రదర్శన చాలా సంతృప్తికరంగా ఉంది. ఆటగాళ్ల విషయంలో నేను ఒకటే సూత్రం ఫాలో అవుతా. యువ క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక, రహానే కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇచ్చాం. అందుకే అతడు బాగా ఆడగలుగుతున్నాడ``ని ధోనీ పేర్కొన్నాడు.