Harbhajan Singh: కోహ్లీ, రోహిత్‌లకేనా? ధవన్‌కు అవకాశాలు ఇవ్వరా? అతడు ఇంకేం నిరూపించుకోవాలి!

ABN , First Publish Date - 2023-04-08T10:05:38+05:30 IST

శిఖర్ ధవన్.. టీమిండియా తరఫున బ్యాటింగ్‌కు దిగి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. అంతేకాదు కొన్ని సిరీస్‌ల్లో టీమిండియాకు నాయకత్వం కూడా వహించాడు. అయినా శిఖర్ ధవన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ దారుణంగా అవమానిస్తోందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆరోపించాడు.

Harbhajan Singh: కోహ్లీ, రోహిత్‌లకేనా? ధవన్‌కు అవకాశాలు ఇవ్వరా? అతడు ఇంకేం నిరూపించుకోవాలి!

శిఖర్ ధవన్ (Shikhar Dhawan).. టీమిండియా తరఫున బ్యాటింగ్‌కు దిగి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. అంతేకాదు కొన్ని సిరీస్‌ల్లో టీమిండియాకు నాయకత్వం కూడా వహించాడు. అయినా శిఖర్ ధవన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ దారుణంగా అవమానిస్తోందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఆరోపించాడు. ధవన్ చివరిసారిగా 2022 డిసెంబర్‌లో టీమిండియా (Team India) తరఫున ఆడాడు. ఆ తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని జట్టు నుంచి తప్పించింది. ఇక మళ్లీ టీమిండియా తరఫున ఆడే అవకాశం రాదని శిఖర్ కూడా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

``శిఖర్ అద్భుత ఆటగాడు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. కొన్నిసార్లు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఓపెనర్‌గా ప్రత్యామ్నాయం కనిపించగానే ధవన్‌‌ను పక్కన పెట్టేశారు. టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి ఇచ్చే విలువ ఇదేనా? రోహిత్ (Rohit Sharma), కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) వంటి ఆటగాళ్లకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కానీ, ధవన్‌లాంటి వాళ్లకు అలాంటి అవకాశాలు ఇవ్వరు. పెద్ద పెద్ద టోర్నీల్లో ధవన్ ఎప్పుడూ విఫలం కాలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంతకంటే అతడింకేం చేయాల``ని హర్భజన్ ప్రశ్నించాడు.

IPL 2023: ఒక్క వికెట్‌కే ఎంత హంగామా చేసిందో చూడండి... ఇంతకీ ఎవరామె? ఆమె గురించి తెలుసుకుంటే..

ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) పంజాబ్ కింగ్స్‌కు (PBKS) ధవన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) (149) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధవన్ (126) రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ తన జట్టును గెలిపించాడు. పంజాబ్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

Updated Date - 2023-04-08T10:05:38+05:30 IST