Hardik Pandya: గేరు మార్చిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-05-06T08:42:20+05:30 IST

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్ (IPL 2023) ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకెళ్తోంది. బౌలర్లు, టాపార్డర్‌ బ్యాటర్లు దుమ్మురేపడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది.

Hardik Pandya: గేరు మార్చిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు.. వీడియో వైరల్!

హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (GT) ఐపీఎల్ (IPL 2023) ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకెళ్తోంది. బౌలర్లు, టాపార్డర్‌ బ్యాటర్లు దుమ్మురేపడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను (RR) మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 17.5 ఓవర్లలో 118 పరుగులకు కుప్పకూలింది. శాంసన్‌ (Sanju Samson) (30) కాస్త ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్‌ 13.5 ఓవర్లలో 119/1 స్కోరు చేసి అలవోకగా ఛేదించింది. పాండ్యా (39 నాటౌట్‌), సాహా (41 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (36) ధాటిగా ఆడడంతో 13.5 ఓవర్లలోనే గుజరాత్ విజయం అందుకుంది. మిగిలి ఉన్న బంతుల పరంగా చూసుకుంటే ఈ సీజన్‌లో ఇదే పెద్ద విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ పడగొట్టి, ఛేజింగ్‌లో 39 పరుగులు చేశాడు. అటు నాయకుడిగానూ ఆకట్టుకున్నాడు.

Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ రనౌట్.. సంజూ శాంసన్‌పై విమర్శలు.. వీడియో వైరల్!

ముఖ్యంగా ఆడమ్ జంపా ( Adam Jampa) వేసిన ఓవర్లో హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించాడు. అప్పుడే శుభ్‌మన్ గిల్ అవుట్ కావడంతో పరుగులు కాస్త నెమ్మదించాయి. దీంతో జంపా వేసిన 11వ ఓవర్లో పాండ్యా చెలరేగాడు. ఆ ఓవర్లో మొత్తం మూడు సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టి 24 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ విజయం దాదాపు ఖరారైపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

Updated Date - 2023-05-06T08:42:20+05:30 IST