SRHvsKKR: ఎట్టకేలకు జూలు విదిల్చిన హ్యారీ బ్రూక్.. విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్!
ABN , First Publish Date - 2023-04-15T09:42:30+05:30 IST
ఇంగ్లండ్ యువ సంచలనం, టీ-20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టి దక్కించుకుంది.
ఇంగ్లండ్ యువ సంచలనం, టీ-20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను (Harry Brook) ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ (SRH) ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా అందరి కళ్లూ బ్రూక్‌పై పడ్డాయి. అయితే ఆశించిన స్థాయిలో బ్రూక్ ఐపీఎల్‌ను (IPL 2023) ప్రారంభించలేకపోయాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయి. ప్రేక్షకులతోపాటు మాజీలు కూడా బ్రూక్‌పై విరుచుకుపడ్డారు.
బ్రూక్ అంత ``విలువైన`` ఆటగాడు కాదని, భారత్ పిచ్‌లపై రాణించడం అతడికి సాధ్యం కాదని చాలా విమర్శలు వినిపించాయి. వాటన్నింటికీ బ్రూక్ ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు. శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట రైడర్స్‌తో (KKR) జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ జూలు విదిల్చాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 100 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదే తొలి సెంచరీ. బ్రూక్ విజృంభించడంతో హైదరాబాద్ పరుగుల వరద పారించింది.
KKRvsSRH: నితీష్ రాణా విధ్వంసం మామూలుగా లేదు.. ఒకే ఓవర్లో 28 పరుగులు.. హైదరాబాద్‌ను వణికించాడుగా..
బ్రూక్‌కు తోడు కెప్టెన్ మార్‌క్రమ్ (Aiden Markram) (50), అభిషేక్ శర్మ (32) రాణించడంతో హైదరాబాద్ టీమ్ ఏకంగా 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కతాపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రూక్ ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో విజయం. బ్రూక్ ఇన్నింగ్స్‌పై హైదరాబాద్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.