GT vs SRH: అంపైర్‌తో హెన్రిచ్ వాగ్వాదం.. షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం.. మ్యాచ్ ఫీజులో కోత!

ABN , First Publish Date - 2023-05-14T13:22:51+05:30 IST

ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కొందరు ఆటగాళ్ల ప్రవర్తన కాస్త శృతిమించుతోంది. టీ-20 అంటేనే తీవ్ర ఒత్తడితో కూడుకున్న గేమ్. అందులోనూ ఐపీఎల్ అంటే ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు ప్రశాంతత కోల్పోయి అప్పుడప్పుడు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు.

GT vs SRH: అంపైర్‌తో హెన్రిచ్ వాగ్వాదం.. షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం.. మ్యాచ్ ఫీజులో కోత!

ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కొందరు ఆటగాళ్ల ప్రవర్తన కాస్త శృతిమించుతోంది. టీ-20 అంటేనే తీవ్ర ఒత్తడితో కూడుకున్న గేమ్. అందులోనూ ఐపీఎల్ అంటే ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు ప్రశాంతత కోల్పోయి అప్పుడప్పుడు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారిని అదుపులో పెట్టేందుకు ఐపీఎల్ యాజమాన్యం జరిమానాలను విధిస్తోంది. తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (SRHvsLSG) దురుసుగా ప్రవర్తించిన హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసిన్‌పై (Heinrich Klaasen) బీసీసీఐ ఫైన్ విధించింది.

హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ వేసిన మూడో బంతి హై-ఫుల్ టాస్‌గా వెళ్లింది. ఆ బంతి బ్యాట్స్‌మెన్ నడుము కంటే పై భాగం నుంచి వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్లు నో-బాల్ (No-Ball) అని ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని లఖ్‌నవూ టీమ్ ఛాలెంజ్ చేసింది. ఆ బాల్‌ హై ఫుల్ టాస్ అయినప్పటికీ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలింది కాబట్టి అది నో-బాల్ కాదని థర్డ్ అంపైర్ (Thrid Umpire) ప్రకటించారు. ఈ నిర్ణయంపై హైదరాబాద్ ఫ్యాన్స్ (SRH Fans) అసహనం వ్యక్తం చే శారు. అప్పటికి బ్యాటింగ్ చేస్తున్న హెన్రిచ్ కూడా లెగ్ అంపైర్‌తో వాదనకు దిగాడు.

Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ సూపర్ సెంచరీ.. ఒంటరి పోరాటంతో పంజాబ్‌ను గెలిపించిన ఓపెనర్!

అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు క్లాసిన్‌కు బీసీసీఐ (BCCI) జరిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అతిక్రమణకు పాల్పడినందుకు క్లాసిన్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా (Fine) విధించింది. అలాగే లఖ్‌నవూ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు (Amit Mishra) కూడా ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎక్విప్‌మెంట్‌పై ప్రతాపం చూపించినందుకు మిశ్రా జరిమానాకు గురయ్యాడు.

Updated Date - 2023-05-14T13:22:52+05:30 IST