Rohit Sharma: ముంబై కెప్టెన్ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్..!
ABN , First Publish Date - 2023-04-23T10:03:39+05:30 IST
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ నాయకుడు ``హిట్ మ్యాన్`` రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 250 సిక్స్‌లు బాదిన భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ (MI) నాయకుడు ``హిట్ మ్యాన్`` రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 250 సిక్స్‌లు బాదిన భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. శనివారం పంజాబ్ కింగ్స్ లెవన్ (PBKS)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఆడిన రోహిత్ 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 పరుగులు చేశాడు. దీంతో మొత్తం ఐపీఎల్ చరిత్రలో 250 సిక్స్‌లు (250 sixes) కొట్టిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు.
ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ (Chris Gayle) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ హార్డ్ హిట్టర్ ఐపీఎల్ హిస్టరీలో ఏకంగా 357 సిక్స్‌లు బాదాడు. గేల్ తర్వాతి స్థానాల్లో డివిల్లీర్స్ (AB de Villiers) (251), రోహిత్ (250) ఉన్నారు. శనివారం ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ముంబై టీమ్ 13 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓడింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో (PBKSvsMI) ఇరు టీమ్‌లూ పోటాపోటీగా రన్స్ సాధించాయి.
Arjun Tendulkar: ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చిన అర్జున్.. కానీ, ఆ వికెట్ మాత్రం హైలెట్!
ఇరు టీమ్‌లు కలిసి ఈ మ్యాచ్‌లో 400 పైచిలుకు పరుగులు చేసి ప్రేక్షకులకు మజా అందించాయి. పంజాబ్ ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు చేసింది. అయితే ముంబై టీమ్ తమ చివరి ఐదు ఓవర్లలో తడబడి మ్యాచ్‌ను చేజార్చుకుంది. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ముంబై విజయాన్ని అడ్డుకున్నాడు.