world championship: వరల్డ్‌ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో ఓడితే.. బజ్‌రంగ్‌, వినేష్‌ ఆసియాడ్‌ బెర్త్‌లు హుళక్కే!

ABN , First Publish Date - 2023-07-26T01:25:04+05:30 IST

స్టార్‌ రెజ్లర్లు బజ్‌రంగ్‌ పూనియా (65 కిలోలు), వినేష్‌ ఫొగట్‌ (53 కిలోలు) వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ట్రయల్స్‌లో ఓడితే.. ఆసియా క్రీడల నుంచి కూడా తప్పించేలా ప్రతిపాదన చేసినట్టు భారత ఒలింపిక్‌ సంఘం అడ్‌హాక్‌ ప్యానెల్‌ సభ్యుడు గియాన్‌ సింగ్‌ తెలిపాడు. పూనియా, ఫొగట్‌కు నేరుగా ఆసియాడ్‌ బెర్త్‌లు కేటాయించిన సంగతి తెలిసిందే.

 world championship: వరల్డ్‌ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో ఓడితే..  బజ్‌రంగ్‌, వినేష్‌ ఆసియాడ్‌ బెర్త్‌లు హుళక్కే!

న్యూఢిల్లీ: స్టార్‌ రెజ్లర్లు బజ్‌రంగ్‌ పూనియా (65 కిలోలు), వినేష్‌ ఫొగట్‌ (53 కిలోలు) వరల్డ్‌ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో ఓడితే.. ఆసియా క్రీడల నుంచి కూడా తప్పించేలా ప్రతిపాదన చేసినట్టు భారత ఒలింపిక్‌ సంఘం అడ్‌హాక్‌ ప్యానెల్‌ సభ్యుడు గియాన్‌ సింగ్‌ తెలిపాడు. పూనియా, ఫొగట్‌కు నేరుగా ఆసియాడ్‌ బెర్త్‌లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, ట్రయల్స్‌ నుంచి వీరిద్దరికీ మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘వరల్డ్‌ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో బజ్‌రంగ్‌, వినేష్‌ నెగ్గితేనే వారిని ఆసియాడ్‌కు పంపాలని ప్రతిపాదించాం. ఓడితే స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఉంటార’ని సింగ్‌ చెప్పాడు. ఆసియా క్రీడలు సెప్టెంబరు 23 నుంచి జరగనుండగా.. వీటికి వారం ముందు వరల్డ్‌ చాంపియన్‌షి్‌పను షెడ్యూల్‌ చేశారు. అంటే ట్రయల్స్‌ వచ్చే నెలలో జరగొచ్చు.

Updated Date - 2023-07-26T01:25:08+05:30 IST