IPL 2023: అర్ష్‌దీప్ vs అఫ్రీది.. భారత్, పాక్ అభిమానుల మధ్య ట్విటర్ వార్.. కారణమేంటంటే..
ABN , First Publish Date - 2023-04-02T10:56:20+05:30 IST
శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ జట్టు తమ స్వంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి ఘనంగా బోణీ కొట్టింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఏడు పరుగుల తేడాతో పంజాబ్ గెలిచింది.
శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు తమ స్వంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను (Kolkata Knight Riders) ఓడించి ఘనంగా బోణీ కొట్టింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఏడు పరుగుల తేడాతో పంజాబ్ గెలిచింది. పంజాబ్ విజయంలో బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) కీలకంగా నిలిచాడు. 19/3తో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అయితే వికెట్లు పడగొట్టిన తర్వాత అర్ష్‌దీప్ సెలబ్రేషన్స్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
వికెట్ పడగొట్టిన తర్వాత అర్ష్‌దీప్ రెండు చేతులను గాల్లోకి లేపి హాఫ్ స్ప్రింట్ చేశాడు. మూడో వికెట్ తీసినపుడు కూడా అలాగే చేశాడు. దీంతో పాకిస్థాన్ బౌలర్ షాహిన్ అఫ్రీదిని (Shaheen Shah Afridi) అర్ష్‌దీప్ అనుకరిస్తున్నాడు అంటూ పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన ఓ క్రికెట్ ప్రేమికుడు ట్విటర్‌లో కామెంట్ చేశాడు. అతడికి కౌంటర్‌గా పలువురు ఇండియా ఫ్యాన్స్ మరికొన్ని ట్వీట్లు చేశారు. నిజానికి అలా వేడుక చేసుకునే విధానాన్ని టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) మొదట ప్రారంభించాడని, దాన్ని ఆఫ్రీది, అర్ష్‌దీప్ అనుకరిస్తున్నారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
IPL 2023: వుయ్ మిస్ యూ పంత్.. ఢిల్లీ టీమ్ ఏం చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న ఫొటో
జహీర్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోను కూడా ట్విటర్‌లో షేర్ చేశాడు. ఈ విషయమై భారత్, పాక్ అభిమానులు ట్వీట్లతో (Twitter War) హల్‌చల్ చేస్తున్నారు. కాగా, పంజాబ్ విషయంలో అర్ష్‌దీప్‌తో పాటు శ్రీలంక ఆటగాడు రాజపక్స (50), సామ్ కర్రన్ (26 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా బ్యాటర్లలో పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (35), వెంకటేశ్ అయ్యర్ (34) మెరిశారు.