IPL 2023: దాదాపు రెండేళ్ల తర్వాత బరిలోకి దిగిన ఇషాంత్.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి ఘనంగా పునరాగమనం!

ABN , First Publish Date - 2023-04-21T08:43:45+05:30 IST

ఇషాంత్ శర్మ.. ఐదారేళ్ల క్రితం టీమిండియాకు ప్రధాన బౌలర్. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించిన పేసర్. అయితే ఇషాంత్ తరచుగా గాయాల బారిన పడుతుండడంతో పాటు యువ బౌలర్ల రాక అతడి అవకాశాలను దెబ్బ కొట్టింది.

IPL 2023: దాదాపు రెండేళ్ల తర్వాత బరిలోకి దిగిన ఇషాంత్.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి ఘనంగా పునరాగమనం!

ఇషాంత్ శర్మ (Ishant Sharma).. ఐదారేళ్ల క్రితం టీమిండియాకు ప్రధాన బౌలర్. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించిన పేసర్. అయితే ఇషాంత్ తరచుగా గాయాల బారిన పడుతుండడంతో పాటు యువ బౌలర్ల రాక అతడి అవకాశాలను దెబ్బ కొట్టింది. 2021లో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆ తర్వాత పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవల జరిగిన మినీ వేలంలో ఢిల్లీ టీమ్ (DC) ఇషాంత్‌ను రూ.50 లక్షల నామమాత్రపు ధరకు దక్కించుకుంది.

ఢిల్లీ టీమ్‌తో పాటే ఉంటున్నా ఇషాంత్‌కు మాత్రం తుది జట్టులో స్థానం దొరకలేదు. ఈ ఐపీఎల్‌లో (IPL 2023) వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ టీమ్ గురువారం రాత్రి ఢిల్లీలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (KKRvsDC)తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇషాంత్‌కు ఆడే అవకాశం లభించింది. దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ 4 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

IPL 2023: ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌కు యాపిల్ సీఈవో హాజరు.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌తో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేసిన టిమ్ కుక్!

ఎట్టకేలకు ఢిల్లీ టీమ్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 127 పరుగులకే ఆలౌటైంది. జేసన్‌ రాయ్‌ (43), రస్సెల్‌ (38 నాటౌట్‌) రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ టీమ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టాలు పడింది. వార్నర్ (David Warner) (57) మరోసారి అర్ధశతకం సాధించడంతో 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

Updated Date - 2023-04-21T08:43:45+05:30 IST