Shivam Dube: శివమ్ దూబే సిక్సర్.. పరిగెత్తిన ఛీర్ గాళ్స్.. పెద్ద ప్రమాదం తప్పింది!

ABN , First Publish Date - 2023-05-15T11:18:46+05:30 IST

ఐపీఎల్ అంటే ఆటగాళ్ల విన్యాసాలే కాదు.. ఛీర్‌గాళ్స్ నృత్యాలు కూడా. బ్యాట్స్‌మెన్ బౌండరీలు కొట్టినపుడు, బౌలర్లు వికెట్లు తీసినపుడు ఆయా జట్లకు చెందిన ఛీర్‌గాళ్స్ తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఉల్లాసం కలిగిస్తారు.

Shivam Dube: శివమ్ దూబే సిక్సర్.. పరిగెత్తిన ఛీర్ గాళ్స్.. పెద్ద ప్రమాదం తప్పింది!

ఐపీఎల్ (IPL 2023) అంటే ఆటగాళ్ల విన్యాసాలే కాదు.. ఛీర్‌లీడర్స్ (Cheer leaders) నృత్యాలు కూడా. బ్యాట్స్‌మెన్ బౌండరీలు కొట్టినపుడు, బౌలర్లు వికెట్లు తీసినపుడు ఆయా జట్లకు చెందిన ఛీర్‌గాళ్స్ తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఉల్లాసం కలిగిస్తారు. తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఛీర్‌గాళ్స్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. చెన్నైలో ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ (CSKvsKKR) జరిగింది. మొదట చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది.

చెన్నై బ్యాటర్ శివమ్ దూబే (Shivam Dube) బౌండరీలతో చెలరేగి 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కోల్‌కతా బౌలర్ సుయాశ్ శర్మ వేసిన ఐదో బంతిని శివమ్ ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్స్ (Shivam Dube Six) కొట్టాడు. ఆ బంతి నేరుగా ఛీర్ గాళ్స్ కూర్చున్న కుర్చీల వైపు వెళ్లింది. బంతి తమ వైపే రావడం చూసి వారు పరిగెత్తారు. అయినా ఒక ఛీర్ గర్ల్‌కు బంతి స్వల్పంగా తగిలింది. ఆమె నొప్పితో విలవిలలాడింది. బంతి నేరుగా వచ్చి తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఆ ఘటన తర్వాత ఛీర్ గాళ్స్ నవ్వుకుంటూ కనిపించారు.

MS Dhoni: ధోనీ కోసం ఎదురుచూపులు.. జడేజా అవుట్ అయినప్పుడు పండగ చేసుకున్న చెన్నై ఫ్యాన్స్!

ఈ మ్యాచ్‌లో చెన్నైపై కోల్‌కతా టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసి నెగ్గింది. నితీశ్‌ రాణా (57 నాటౌట్‌), రింకూ సింగ్‌ (54) హాఫ్‌ సెంచరీలు సాధించారు.

Updated Date - 2023-05-15T11:18:46+05:30 IST