Rinku Singh: రెండో సిక్స్ కొట్టాక నమ్మకం కలిగింది.. రింకూ ఇన్నింగ్స్‌పై కేకేఆర్ కెప్టెన్ ప్రశంసలు!
ABN , First Publish Date - 2023-04-10T11:19:20+05:30 IST
గతేడాది ఛాంపియన్‌గా నిలవడంతోపాటు ఈ ఐపీఎల్‌లోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు కేకేఆర్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ చెక్ చెప్పాడు.
గతేడాది ఛాంపియన్‌గా నిలవడంతోపాటు ఈ ఐపీఎల్‌లోనూ (IPL 2023) వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు కేకేఆర్ (KKR) బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ (Rinku Singh) చెక్ చెప్పాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (KKRvsGT) అద్భుత ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ బౌలర్లను వణికించాడు. ఓటమి తథ్యం అనుకున్న మ్యాచ్‌లో చెలరేగి ఆడి కోల్‌కతాను గెలిపించాడు. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా (Nitish Rana) స్పందించాడు. రింకూపై ప్రశంసలు కురిపించాడు.
``గతేడాది ఐపీఎల్‌లో కూడా రింకూ ఇలాగే చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో మేం గెలవలేకపోయాం. ఈసారి రింకూ అద్భుతం చేస్తాడని నాకు ఎందుకో అనిపించింది. చివరి ఓవర్లో రింకూ రెండో సిక్స్ కొట్టాక మాకు చిన్న నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే బౌలర్ యశ్ దయాల్ సరైన ప్రదేశంలో బంతిని విసరలేకపోతున్నాడు. రింకూ అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి మాటల్లేవు. రషీద్ హ్యాట్రిక్ తర్వాత రింకూ అలా ఆడడం అద్భుతం`` అని రాణా అన్నాడు.
Rinku Singh: ఇదెక్కడి బ్యాటింగ్‌రా బాబోయ్.. ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను ఎలా లాగేసుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో
కాగా, గుజరాత్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) కూడా రింకూ సింగ్‌ను ప్రశంసించాడు. అద్భుతమైన ఆటతీరుతో తమ నుంచి రింకూ మ్యాచ్ లాగేసుకున్నాడని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు 100 మ్యాచ్‌ల్లో ఒకసారి మాత్రమే ఎదురవుతాయని చెప్పాడు. చివరి ఓవర్ తప్ప మ్యాచ్ అంతా తమ కంట్రోల్‌లోనే ఉందని అన్నాడు.