Kyle Mayers: వామ్మో.. ఇదేం సిక్స్‌రా బాబోయ్.. బంతి ఆకాశంలోకి వెళ్లిపోయినట్టుంది.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-04-29T10:31:58+05:30 IST
గత మ్యాచ్‌లో 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన లఖ్‌నవూ బ్యాటర్లు శుక్రవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయారు. మొహలీలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు.
గత మ్యాచ్‌లో 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన లఖ్‌నవూ (LSG) బ్యాటర్లు శుక్రవారం పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయారు. మొహలీలో (Mohali) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. ఈ సీజన్‌లో (IPL 2023) ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు. మొత్తం ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోరు. ఛేజింగ్‌లో తడబడిన పంజాబ్ 56 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
తొలుత కైల్ మేయర్స్ (Kyle Mayers), ఆ తర్వాత ఆయుష్ బదోనీ (Ayush Badoni), అనంతరం మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) విజృంభించారు. మేయర్స్ (24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), బదోనీ (24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 45) బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా కైల్ మేయర్స్ అద్భుత ఆరంభాన్ని అందించాడు. మూడో ఓవర్లో మేయర్స్ కొట్టిన సిక్స్ (Huge Six) స్టేడియం కంటే ఎత్తుకు వెళ్లింది.
Badoni vs Livingstone: బదోనీ, లివింగ్‌స్టన్ మధ్య హైడ్రామా.. ఎత్తుకు పై ఎత్తులు.. చివరకు ఏమైందంటే..
లఖ్‌నవూ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పంజాబ్ బౌలర్ గుర్‌నూర్ సింగ్‌కు మేయర్స్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్ మూడో బంతిని మేయర్స్ లెగ్ సైడ్ భారీ షాట్ కొట్టాడు. ఆ బంతి గాల్లో ఏకంగా 50 మీటర్లు పైకి వెళ్లింది. లఖ్‌నవూ డగౌట్‌లో కూర్చున్న ఆటగాళ్లు ఆ సిక్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.