Watch Video: ఢిల్లీపై లఖ్‌నవూ సూపర్ విక్టరీ.. మార్క్ ఎలా విజృంభించాడో చూడండి.. ఖాతాలో సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2023-04-02T08:35:54+05:30 IST

ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2023)ను ఘనంగా ప్రారంభించాడు. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే మర్చిపోలేని గణాంకాలను నమోదు చేశాడు.

Watch Video: ఢిల్లీపై లఖ్‌నవూ సూపర్ విక్టరీ.. మార్క్ ఎలా విజృంభించాడో చూడండి.. ఖాతాలో సరికొత్త రికార్డు

ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ (Mark Wood) ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2023)ను ఘనంగా ప్రారంభించాడు. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే మర్చిపోలేని గణాంకాలను నమోదు చేశాడు. తమ జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. శనివారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌‌తో (LSG vs DC) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 రన్స్‌ తేడాతో లఖ్‌నవూ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు సాధించింది. అనంతరం భారీ ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసి ఓడింది.

మార్క్ వుడ్ (4-0-14-5) కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. 147కి.మీ వేగంతో మార్క్ వుడ్ విసిరిన బంతులకు ఢిల్లీ పూర్తిగా తడబడింది. వరుస బంతుల్లో పృథ్వీ షా, మిచెల్ మార్ష్ వంటి ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన మార్క్ ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే సర్ఫ్‌రాజ్ ఖాన్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చారు. మార్క్ పేస్‌కు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ దగ్గర జవాబే లేకుండా పోయింది. ఇక, చివరి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చి అక్షర్ పటేల్, చేతన్ సకారియాలను ఔట్ చేసి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL 2023: వుయ్ మిస్ యూ పంత్.. ఢిల్లీ టీమ్ ఏం చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న ఫొటో

ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్లు పడగొట్టిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా మార్క్ నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ బౌలర్ దిమిత్రి మస్కరెన్సాస్ కూడా గతంలో ఈ ఘనత సాధించాడు. టీ-20 క్రికెట్‌లో ఐదు వికెట్లు తీయడం మార్క్‌కు ఇదే తొలిసారి. అలాగే తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టిన లఖ్‌నవూ బౌలర్ కూడా మార్క్ కావడం విశేషం.

Updated Date - 2023-04-02T08:35:54+05:30 IST