MIvsKKR: ముంబై, కోల్‌కతా కెప్టెన్లకు భారీ జరిమానా.. ఎవరి తప్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-04-17T09:15:50+05:30 IST

ఆదివారం సాయంత్రం ముంబై‌లోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచింది. ఫ్లాట్ వికెట్‌పై ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకున్నారు.

MIvsKKR: ముంబై, కోల్‌కతా కెప్టెన్లకు భారీ జరిమానా.. ఎవరి తప్పు ఏంటంటే..

ఆదివారం సాయంత్రం ముంబై‌లోని (Mumbai) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ (IPL 2023) మ్యాచ్ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచింది. ఫ్లాట్ వికెట్‌పై ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకున్నారు. ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) (104) సెంచరీ చేశాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబై బ్యాటర్లు రాణించడంతో 17.4 ఓవర్లలోనే టార్గెట్‌ను చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav), కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా (Nitish Rana) భారీ జరిమానాలకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడంతో సూర్య కుమార్‌ యాదవ్ ముంబై టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే స్లో-ఓవర్ రేట్ (slow over-rate) కారణంగా సూర్యకు ఐపీఎల్ యాజమాన్యం ఫైన్ (Fine) విధించింది. రూ.12 లక్షలు జరిమానా వేసింది. సెంచరీ హీరో వెంకటేష్ అయ్యర్ గాయం కారణంగా బాధపడడం వల్ల కూడా కొంచెం ఆలస్యం అయింది.

MIvsKKR: జహీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇస్తుండగా రోహిత్, ఇషాన్ కిషన్ ఏం చేశారో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ఇక, ముంబై బౌలర్ షోకీన్‌పై (Hrithik Shokeen) అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతో కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణాకు కూడా భారీ జరిమానా విధించారు. షోకీన్ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతికి క్యాచ్ ఇచ్చి రాణా అవుటయ్యాడు. ఆ సమయంలో షోకీన్‌పై రాణా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మ్యాచ్ రిఫరీ నిర్ధారణకు వచ్చారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు నిర్ధారించి రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాణాను కవ్వించిన షోకీన్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు.

Updated Date - 2023-04-17T09:15:50+05:30 IST