Mitchell Marsh: ఢిల్లీ టీమ్‌కు అతి పెద్ద బలం.. మార్ష్ నిఖార్సైన ఆల్ రౌండర్ అంటూ ప్రశంసలు!
ABN , First Publish Date - 2023-04-30T11:29:10+05:30 IST
టీ-20 క్రికెట్‌లో, ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆల్ రౌండర్స్‌కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తాయి. ప్రస్తుత ఐపీఎల్ టీమ్‌లలో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు.
టీ-20 క్రికెట్‌లో, ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆల్ రౌండర్స్‌కు (All-rounder) ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తాయి. ప్రస్తుత ఐపీఎల్ (IPL 2023) టీమ్‌లలో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, ఆండ్రూ రస్సెల్, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ వంటి టాప్ క్లాస్ ఆల్ రౌండర్స్ ఉన్నారు. అయితే వీరు ఒక్క మ్యాచ్‌లో ఏదో ఒక్క విభాగంలోనే రాణిస్తున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఆల్ రౌండ్ ప్రదర్శన చేస్తుంటారు.
ఢిల్లీ (DC) టీమ్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) మాత్రం ఆటు బౌలింగ్‌లోనూ, ఇటూ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (SRHvsDC) మార్ష్ రెండు విభాగాల్లోనూ ఒంటరి పోరాటం చేశాడు. మొదట బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లోనూ మార్ష్ మెరిశాడు. 39 బంతుల్లో ఒక్క ఫోర్, 6 సిక్స్‌లతో 63 పరుగులు చేసింది. మార్ష్‌కు మరెవరూ అండగా నిలబడకపోవడంతో ఢిల్లీ టీమ్ విజయానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
DCvsSRH: హ్యారీ బ్రూక్ సూపర్ ఫీల్డింగ్.. ప్రత్యర్థి టీమ్ బ్యాట్స్‌మెన్ నుంచి కూడా అభినందన!
ఈ మ్యాచ్‌లో మార్ష్ ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ఓడినప్పటికీ అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన మార్ష్‌కే ``ప్లేయర్ ఆఫ్ ది సిరీస్`` అవార్డు దక్కింది. ``ఢిల్లీ ఓడిపోయినా మార్ష్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చూసే అవకాశం దక్కింది``, ``మార్ష్‌ను మించిన ఆల్ రౌండర్ ప్రస్తుతం ఇంకెవరూ లేరు``, ``నిజమైన క్వాలిటీ ఆల్ రౌండర్`` అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.