RCBvsMI: చూసుకోవాలి కద బ్రో.. ఇద్దరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది.. ఇంతకీ అది ఎవరు పట్టుకోవాల్సిన క్యాచ్ అంటారు మాస్టారూ..!
ABN , First Publish Date - 2023-04-03T09:49:44+05:30 IST
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్), డుప్లెసి (73) అద్భుత ఆటతీరుతో చెలరేగడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 8 వికెట్లతో సునాయాసంగా గెలిచేసింది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్), డుప్లెసి (73) అద్భుత ఆటతీరుతో చెలరేగడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers Bangalore) 8 వికెట్లతో సునాయాసంగా గెలిచేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కీపర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik), బౌరల్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చేసిన ఓ తప్పిదం కెప్టెన్ కోహ్లీకి (Viral Kohli) అసహనం కలిగించింది. ఇద్దరూ కలిసి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను వదిలేశారు.
ముంబై ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్లో ఓ షార్ట్ పిచ్ బంతిని రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ కొట్టాడు. అయితే టైమ్ సరిగ్గా కుదరకపోవడంతో ఆ బాల్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దానిని పట్టుకోవడానికి కీపర్ దినేష్, బౌలర్ సిరాజ్ కూడా పరిగెత్తారు. అయితే ఒకరినొకరు చూసుకోకపోవడంతో ఇద్దరూ ఢీకొట్టుకుని బంతిని వదిలేశారు. సులభమైన క్యాచ్‌ను (Catch drop) డ్రాప్ చేయడంతో కెప్టెన్ కోహ్లీ ఇద్దరిపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.
IPL 2023: కోట్లు పోసి కొంటే ఇలానా ఆడేది.. అట్టర్‌ప్లాప్ అయిన ఈ ముగ్గురినీ ఎంతకు కొన్నారో గుర్తుందా..?
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా తిలక్ వర్మ (84 నాటౌట్) ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోరైనా దక్కింది. ఛేదనలో కోహ్లీ, డుప్లెసీ రాణించడంతో బెంగళూరు 16.2 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది.