IPL 2023: స్టంప్స్ వెనకాల సూపర్ మ్యాన్ ధోనీ అద్భుత ప్రదర్శన.. వేరెవరకీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న మహీ!

ABN , First Publish Date - 2023-04-22T09:24:56+05:30 IST

ఎమ్‌ఎస్ ధోనీ.. ప్రపంచ క్రికెట్‌లో ఓ సంచలనం. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, నాయకుడిగా టీమిండియాకు ధోనీ చేసిన సేవలు మరువలేనివి. కీపింగ్ విషయంలో ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తుమ కీపర్లలో ఒకడు.

IPL 2023: స్టంప్స్ వెనకాల సూపర్ మ్యాన్ ధోనీ అద్భుత ప్రదర్శన.. వేరెవరకీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న మహీ!

ఎమ్‌ఎస్ ధోనీ (MS Dhoni).. ప్రపంచ క్రికెట్‌లో ఓ సంచలనం. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, నాయకుడిగా టీమిండియాకు ధోనీ చేసిన సేవలు మరువలేనివి. కీపింగ్ విషయంలో ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తుమ కీపర్లలో ఒకడు. తాజాగా ఐపీఎల్‌లో (IPL 2023) కూడా ధోనీ కీపింగ్‌లో అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 200కు పైగా అవుట్స్ (క్యాచ్‌లు+రన్ అవుట్లు+స్టంపింగ్స్) చేసిన తొలి కీపర్‌గా ధోనీ రికార్డు సొంతం చేసుకున్నాడు (Dhoni 200 dismissals in IPL).

ధోనీ తర్వాతి స్థానంలో దినేష్ కార్తీక్ (187), డివిల్లియర్స్ (140) ఉన్నారు. మొత్తం ఐపీఎల్‌లో 233 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 138 క్యాచ్‌లు, 40 స్టంపింగ్స్, 22 రనౌట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ అద్భుతంగా కీపింగ్ చేశాడు. మార్‌క్రమ్, మయాంక్, వాషింగ్టన్ సుందర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ముఖ్యంగా సుందర్‌ను రనౌట్ చేసిన తీరుపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ravindra Jadeja: జడేజాకు కోపమొచ్చింది.. క్యాచ్ అడ్డుకున్న క్లాసెన్.. అదే ఓవర్లో ఏం జరిగిందంటే..

శుకవ్రారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (SRH) జరిగిన మ్యాచ్‌లో చెన్నై టీమ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో జడేజా (Ravindra Jadeja) (22/3) రాణించాడు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై చాలా నెమ్మదిగా ఆడింది. అయితే ఓపెనర్ కాన్వే (Devon Conway) (77 నాటౌట్) క్రీజులో పాతుకుపోవడంతో చెన్నై విజయ తీరాలకు చేరింది.

Updated Date - 2023-04-22T09:24:56+05:30 IST