IPL 2023: సూర్యకుమార్ యాదవ్‌కు ధోనీ టిప్స్.. మ్యాచ్ అనంతరం మీటింగ్.. వైరల్ అవుతున్న ఫొటో!
ABN , First Publish Date - 2023-04-09T11:54:39+05:30 IST
ఐపీఎల్‌లో (IPl 2023) అద్భుతంగా రాణించి ప్రపంచ క్రికెట్‌లోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav).
ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి ప్రపంచ క్రికెట్‌లోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఏబీ డివిలీర్స్ తరహాలో మైదానం నలువైపులా షాట్లు కొడుతూ క్రికెట్ ప్రేమికులను ఫిదా చేశాడు. టీ-20 స్పెషలిస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొద్ది రోజులుగా ఫామ్ కోల్పోయి సూర్య తంటాలు పడుతున్నాడు. కనీసం పది పరుగులు కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు.
శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై, ముంబై జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది (MIvsCSK). ఈ మ్యాచ్‌లో కూడా సూర్య తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. స్వీప్ షాట్‌కు ప్రయత్నించి ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం మైదానంలో ధోనీతో (Dhoni) సూర్య చాలా సేపు మాట్లాడాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సూర్య.. ధోనీ నుంచి విలువైన సలహాలు స్వీకరించాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Dhoni share tips with Suryakumar).
CSKvsMI: వామ్మో.. నమ్మశక్యం కాని క్యాచ్.. ఇద్దరూ కలిసి ఎలా పట్టేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!
2022లో పరుగుల వరద పారించిన సూర్య కుమార్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో తొలి బంతికే (Golden Ducks) అవుటయ్యాడు. ఐపీఎల్‌లో (IPL 2023) కూడా మెరుగ్గా రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీతో సూర్య మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ధోనీ సలహాతో సూర్య తిరిగి తన ఫామ్ అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.