CSK vs RR: మరెవరికీ సాధ్యం కాని రికార్డు.. అరుదైన ఘనతను స్వంతం చేసుకోబోతున్న ధోనీ..!
ABN , First Publish Date - 2023-04-12T12:51:27+05:30 IST
టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ అరుదైన ఘనతను స్వంతం చేసుకోబోతున్నాడు. ఈ రోజు (బుధవారం) చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది.
టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ (MS Dhoni) అరుదైన ఘనతను స్వంతం చేసుకోబోతున్నాడు. ఈ రోజు (బుధవారం) చెన్నై, రాజస్థాన్ రాయల్స్ (CSKvsRR) జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. చెన్నై కెప్టెన్‌గా ఈ మ్యాచ్ ధోనీకి 200వది కావడం విశేషం. 2008 నుంచి ఇప్పటివరకు 200 సార్లు చెన్నై టీమ్‌కు ధోనీ నాయకుడిగా వ్యవహరించాడు. మధ్యలో 2016లో చెన్నై టీమ్‌ను ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఆ సీజన్‌లో పుణె సూపర్‌జెయింట్స్‌కు ధోనీ నాయకత్వం వహించాడు.
ఆ తర్వాత మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడిగా మారాడు. ఈ రోజు 200వ సారి చెన్నై టీమ్‌ను (CSK Captain) నడిపించబోతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక టీమ్‌కు ఇన్నిసార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత మరెవరికీ లేదు. మొత్తం నాలుగు సార్లు చెన్నైకు టైటిల్ అందించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) (5 టైటిల్స్) తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ రోజు జరగబోయే చారిత్రాత్మక మ్యాచ్ కోసం చెన్నైలోని చెపాక్ స్టేడియం సిద్ధమవుతోంది.
Rohit Sharma: చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ.. మ్యాచ్ గెలిచాక భార్యకు వీడియో కాల్ చేసి..
అలాగే ఒక టీమ్‌కు కెప్టెన్‌గా కోహ్లీ (Virat Kohli) (4881 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోనీ (4482 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక విజయాల శాతం ధోనీదే. అలాగే ధోనీ నాయకత్వంలో చెన్నై టీమ్ రికార్డు స్థాయిలో 9 ఫైనల్ మ్యాచ్‌లు ఆడింది. వాటిల్లో నాలుగు సార్లు గెలుపొందింది. కాగా, ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో గెలుపొంది ధోనీ రికార్డు మ్యాచ్‌ను సెలబ్రేట్ చేసుకుంటామని జడేజా (Ravindra Jadeja) పేర్కొన్నాడు.