MS Dhoni: గాళ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసే ముందు ధోనీ సలహా అడిగిన దీపక్ చాహర్.. చెన్నై కెప్టెన్ ఏం చెప్పాడంటే..
ABN , First Publish Date - 2023-05-28T11:19:22+05:30 IST
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడబోతున్నాయి.
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ (IPL 2023) తుది దశకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో (IPL 2023 Final Match) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందుకున్న ధోనీ (MS Dhoni) సారథ్యంలోని చెన్నై టీమ్ ఏకంగా పదో సారి ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar) తాజాగా తన టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. ధోనీ గేమ్ పట్ల ఎంత సీరియస్‌గా ఉంటాడో ఓ ఇంటర్వ్యూలో దీపక్ చాహర్ తెలిపాడు. ``నా గాళ్‌ఫ్రెండ్ జయకు 2021 ఐపీఎల్ ఫైనల్స్ తర్వాత లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నాను. అదే విషయాన్ని సరదాగా మా టీమ్ కెప్టెన్ ధోనీకి చెప్పాను. అప్పుడు ధోనీ ఓ సలహా ఇచ్చాడు. ఫైనల్ వరకు ఆగొద్దని, ప్లే ఆఫ్స్‌కు ముందే ప్రపోజ్ చేయాలని చెప్పాడు.
Matthew Hayden: జట్టుకు అవసరమైన సమయంలో రోహిత్ ఆడడు.. ఆతడో ఫెయిల్యూర్.. మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు!
ఆ ప్రపోజ్ ప్రోగ్రామ్ పూర్తయిపోతేనే గేమ్ మీద దృష్టి పెట్టడానికి వీలవుతుందని చెప్పాడు. లేకపోతే క్రికెట్ మీద ఫోకస్ ఉండదని చెప్పాడు. నాకు అది కరెక్టే అనిపించింద``ని చాహర్ వెల్లడించాడు. 2021లో ఐపీఎల్ దుబాయ్‌లో జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలోనే జయకు చాహర్ ప్రపోజ్ చేశాడు. చాహర్ ప్రపోజల్‌కు జయ అంగీకారం తెలిపింది. చెన్నై టీమ్ సభ్యుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు (Deepak Chahar’s Proposal). 2022 జూన్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.