MS Dhoni: మెరుపు వేగం అంటే ఇదేనేమో.. ప్రమాదకర గిల్‌ను ధోనీ ఎలా స్టంపౌట్ చేశాడో చూడండి..
ABN , First Publish Date - 2023-05-30T13:58:49+05:30 IST
ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. భారత క్రికెట్‌కు సంబంధించినంత వరకు అత్యుత్తమ కీపర్ అని చెప్పుకోవాలి. కీపింగ్‌లో ధోనీ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పాడు. ఇక, వికెట్ల వెనుక నిలబడి స్టంపింగ్ చేయడంలో అయితే ధోనీ అత్యంత వేగంగా స్పందిస్తాడు
ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఒకడు. భారత క్రికెట్‌కు సంబంధించినంత వరకు అత్యుత్తమ కీపర్ అని చెప్పుకోవాలి. కీపింగ్‌లో (Dhoni Wicket Keeping) ధోనీ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పాడు. ఇక, వికెట్ల వెనుక నిలబడి స్టంపింగ్ (Dhoni Stumping) చేయడంలో అయితే ధోనీ అత్యంత వేగంగా స్పందిస్తాడు. తాజాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSKvsGT) జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL Final Match) జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రమాదకర శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) ధోనీ స్టంపౌట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి.
గిల్ 39 పరుగులతో ఆడుతున్నప్పుడు ఏడో ఓవర్ వేసేందుకు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బంతి అందుకున్నాడు. ఆ ఓవర్ చివరి బంతిని జడేజా ఆఫ్-స్టంప్ లైన్‌లో వేశాడు. దానిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు గిల్ కాస్త ముందుకు వంగాడు. అయితే చివరి నిమిషంలో బాల్ టర్న్ అయింది. ఆ బాల్ అందుకున్న ధోనీ మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు. ఆ వేగం చూసి గిల్ షాకయ్యాడు. రిప్లేలో అది అవుట్ అని తేలింది. కామెంటేటర్లు కూడా ధోనీ వేగానికి ఆశ్చర్యపోయారు.
Jay Shah: ఏంటిది జై షా.. మరీ ఇంత చీప్‌గా.. ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూస్తుంటే ఇదేంటని నెటిజన్స్ ఫైర్..!
ఈ లీగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్‌ను ధోనీ స్టంపౌట్ చేయడంతో పరుగుల ప్రవాహం కాస్తా నెమ్మదించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై టీమ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదో సారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. కాగా, గిల్‌ను ధోనీ స్టంపౌట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.