Rohit Sharma: ``మీరు కర్మను నమ్ముతారు.. మేం శర్మను నమ్ముతాం..`` ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ కౌంటర్!

ABN , First Publish Date - 2023-04-12T14:43:33+05:30 IST

ముంబై ఇండియన్స్ (MI) జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది.

Rohit Sharma: ``మీరు కర్మను నమ్ముతారు.. మేం శర్మను నమ్ముతాం..`` ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ కౌంటర్!

ముంబై ఇండియన్స్ (MI) జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అంతేకాదు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) హాఫ్ సెంచరీ చేసి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా (Player of the Match) నిలిచాడు. దాదాపు రెండేళ్ల తర్వాత రోహిత్ చేసిన హాఫ్ సెంచరీ ఇది. అలాగే ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలవడం రోహిత్‌కు ఇది 19వ సారి. ఐపీఎల్ చరిత్రలో ఇన్నిసార్లు ఆ అవార్డు మరే ఆటగాడికి దక్కలేదు.

ఇన్ని సానుకూలతల నడుమ ముంబై టీమ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరోక్షంగా ఆర్సీబీకి (MI counter to RCB) కౌంటర్ ఇచ్చింది. ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో ముంబై టీమ్ తలపడింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ విఫలమయ్యాడు. అవుటై పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో బెంగళూరు ఫ్యాన్స్ ``రోహిత్ వడపావ్`` అని ఎగతాళి చేశారు. 5 సార్లు టైటిల్ గెలిచిన రోహిత్‌ను అలా గేలి చేయడం ముంబై టీమ్ తట్టుకోలేకపోయింది. ఢిల్లీతో మ్యాచ్ గెలిచిన వెంటనే ఆర్సీబీకీ కౌంటర్ ఇచ్చింది.

IPL 2023: 5 బంతుల్లో 5 సిక్స్‌లు.. ఆ మ్యాచ్ తర్వాత యశ్ దయాల్ తల్లి అన్నం తినలేదట, రాత్రంతా ఏడుస్తూనే ఉందట..!

``మీరు కర్మను నమ్ముతారు.. మేం శర్మను నమ్ముతాం`` (You believe in Karma, we believe in Sharma) అని ముంబై ఇండియన్స్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన ఆర్సీబీ ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ముంబై మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది.

Updated Date - 2023-04-12T14:43:33+05:30 IST