IPL 2023: ఐపీఎల్‌లో గుజరాత్ తొలి భారీ స్కోరు.. ముంబై చెత్త రికార్డు!

ABN , First Publish Date - 2023-04-26T11:03:41+05:30 IST

గతేడాది ఛాంపియన్స్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ లీగ్‌లో కూడా సత్తా చాటుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగి తమ స్థాయికి తగినట్టు ఆడుతోంది. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 55 పరుగుల తేడాతో గెలుపొందింది.

IPL 2023: ఐపీఎల్‌లో గుజరాత్ తొలి భారీ స్కోరు.. ముంబై చెత్త రికార్డు!

గతేడాది ఛాంపియన్స్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఈ లీగ్‌లో కూడా సత్తా చాటుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగి తమ స్థాయికి తగినట్టు ఆడుతోంది. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో (MI) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 55 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబైపై పైచేయి సాధించింది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 2 ఓడి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది (GTvsMI).

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 207 పరుగులు చేసింది ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యధిక స్కోరు. శుభ్‌మన్ గిల్ (56), డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 207/6 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ విజృంభించింది. నూర్ అహ్మద్ (3/37), రషీద్ ఖాన్ (2/27) రాణించడంతో ముంబైని 152 పరుగులకే కట్టడి చేశారు.

Sara Tendulkar: శుభ్‌మన్ గిల్ vs అర్జున్ టెండూల్కర్, సారా సపోర్ట్ ఎవరికి? నెటిజన్ల ఫన్నీ మీమ్స్!

ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన ముంబై టీమ్ చెత్త రికార్డులను తమ పేరిట లిఖించింది. 2017 తర్వాత ఇంత భారీ తేడాతో (55 పరుగులు) ఓడిపోవడం ముంబైకి ఇదే తొలిసారి. ఇక, ఈ సీజన్‌లో రెండు సార్లు పవర్ ప్లేలో తక్కువ స్కోరు నమోదు చేసిన టీమ్‌గా కూడా నిలిచింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొలి 6 ఓవర్లలో కేవలం 29 పరుగులు చేసింది. అలాగే మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలి 6 ఓవర్లలో కూడా 29 పరుగులే చేసింది.

Updated Date - 2023-04-26T11:03:41+05:30 IST